Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 04 Oct 2021 18:30:28 IST

ఐఫిల్ టవర్ ముందు ఐష్... తెల్లబోయేలా తెల్లటి అందాలు!

twitter-iconwatsapp-iconfb-icon
ఐఫిల్ టవర్ ముందు ఐష్... తెల్లబోయేలా తెల్లటి అందాలు!

ఐశ్వర్య రాయ్... మరో వర్ణన అవసరం లేని విశేషణం! 47 ఏళ్ల ప్రపంచ సుందరి కాలంతో పాటూ తనలోని కాంతిని కూడా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందుకు తాజా ఉదహరణ ఆమె లెటెస్ట్ ప్యారిస్ ఫ్యాషన్ షో పిక్సే!

ఐఫిల్ టవర్ ముందు ఐష్... తెల్లబోయేలా తెల్లటి అందాలు!

దాదాపు రెండేళ్లుగా దేశం దాటి వెళ్లని  ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఎట్టకేలకు ఇండియా బయట అడుగుపెట్టింది. ఏటా ఫ్రాన్స్‌లో జరిగే ‘ప్యారిస్ ఫ్యాషన్ వీక్’లో అద్భుతంగా మెరిసిపోయింది. ఐఫిల్ టవర్ బ్యాక్‌డ్రాప్‌లో వేదిక ఏర్పాటు చేయగా పై నుంచీ కింద వరకూ శ్వేత వర్ణ వస్త్రాలు ధరించి నిలువెత్తు చందమామలా మెరిసిపోయింది.

ఐఫిల్ టవర్ ముందు ఐష్... తెల్లబోయేలా తెల్లటి అందాలు!

చాలా రోజులుగా ఇంటిపట్టునే ఉండిపోయిన ఐశ్వర్య, దర్శకుడు మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ మూవీ షూటింగ్, కరోనా కొనసాగుతుండగానే పూర్తి చేసింది. అయినా ఆమె ఫోటోలు ఎక్కడా పెద్దగా చక్కర్లు కొట్టలేదు. లాక్‌డౌన్స్‌ నేపథ్మంలో ఆమె విదేశాలకు కూడా ఇంతకాలం వెళ్లలేదు. దాంతో ఐష్ అభిమానులకి ఆమె దర్శనమే లేకుండా పోయింది. కానీ, ఆదివారం ఆమె ప్యారిస్‌లో ఫుల్ వైట్ కాస్ట్యూమ్స్‌లో హొయలుపోవటంతో ఇంటర్నెట్ భగ్గుమంది! తెల్లబోయిన ఫ్యాన్స్‌ని తెల్లటి వస్త్రాల ఐశ్వర్యని తెగ వైరల్ చేసేస్తున్నారు...

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest Telugu Cinema Newsమరిన్ని...

Advertisement
Advertisement