స్పీడ్ పెంచనున్న ఎయిర్‌టెల్ 4జీ.. ఇక వినియోగదారులకు పండగే..

ABN , First Publish Date - 2020-07-06T23:40:45+05:30 IST

మీరు ఎయిర్‌టెల్ వినియోగదారుడా.. అయితే మీకో శుభవార్త. ఎయిర్‌టెల్ ప్లాటినం పాక్ వినియోగదారులకు...

స్పీడ్ పెంచనున్న ఎయిర్‌టెల్ 4జీ.. ఇక వినియోగదారులకు పండగే..

న్యూఢిల్లీ: మీరు ఎయిర్‌టెల్ వినియోగదారుడా.. అయితే మీకో శుభవార్త. ఎయిర్‌టెల్ ప్లాటినం పాక్ వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించనున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఈ మేరకు నేడు ‘ప్రయారిటీ 4జీ నెట్‌వర్క్’ను విడుదల చేసింది. ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా రూ.499, ఆపైన ప్లాన్‌లో ఉన్న ప్రతి పోస్ట్‌పెయిడ్ కస్టమర్లు ప్లాటినం విభాంగంలోకి వస్తారని సంస్థ తెలిపింది. ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్ కోసం వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్ అవసరమవుతుందని, ఎయిర్‌టెల్  ఇప్పటికే ఈ విభాగంలో ముందు వరుసలో ఉందని యాజమాన్యం పేర్కొంది. అయితే దీనిని మరింత పెంచేందుకు అవసరమైన సరికొత్త టెక్నాలజీలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది.


దీని ద్వారా వినియోగదారులకు మరింత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించగలుగుతామని ధీమా వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే వినియోగదారులకు ప్లాటినం సబ్‌స్క్రిప్షన్‌ను అందించేందుకు అన్ని ప్రాంతాల్లోని ఎయిర్‌టెల్ కాల్ సెంటర్లు, సిబ్బంది అందుబాటులో ఉండనున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది. ఎవరైనా ప్రస్తుత ఎయిర్‌టెల్ వినియోగదారులు ప్లాటినం ప్లాన్‌ పొందాలనుకుంటే రూ.499, లేదా ఆ పైన పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌ను తీసుకోవాలని సూచించింది. 

Updated Date - 2020-07-06T23:40:45+05:30 IST