Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎయిర్‌టెల్ వినియోగదారులకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లతో ప్రతిరోజూ ఉచిత డేటా!

న్యూఢిల్లీ: ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను ఇటీవల పెంచి ఖాతాదారులకు షాకిచ్చిన ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. ఎంపిక చేసిన ప్లాన్లపై ప్రతి రోజు 500 ఎంబీ డేటాను ఉచితంగా ఇస్తున్నట్టు ప్రకటించింది. రూ. 265, రూ. 299, రూ.719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్లపై మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇటీవల ప్రీపెయిడ్ ప్యాక్ ధరలను పెంచిన ఎయిర్‌టెల్ మరింత టాక్‌టైమ్, మరింత డేటా అందిస్తామని అప్పట్లో పేర్కొంది. 


ఎయిర్‌టెల్ తాజాగా ప్రకటించిన ఆఫర్ అన్ని ప్లాన్లకు వర్తించదు. ఇక, రూ. 265 ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా 28 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో రోజుకు 2జీబీ డేటా 28 రోజులపాటు లభిస్తుండగా, రూ. 839 ప్లాన్‌లో 84 రోజుల కాలపరిమితితో రోజుకు 2.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లతో రీచార్జ్ చేసుకునే వారికి మాత్రమే ప్రతి రోజు అదనంగా 500 ఎంబీ డేటా లభిస్తుంది. 


అదనపు డేటా ఆఫర్ ప్లాన్ కాలపరిమితి ఉన్నంత వరకే ఉంటుంది. ప్లాన్ కాలపరిమితి ముగిసిన తర్వాత ఆ ఆఫర్ కూడా ముగిసిపోతుంది. అదనపు డేటాకు రోల్ ఓవర్ సౌలభ్యం ఉండదని ఎయిర్‌టెల్ తెలిపింది. కాగా, ఈ అదనపు డేటా ఆఫర్ ఎంతకాలం ఉంటుందనే వివరాలను మాత్రం ఎయిర్‌టెల్ వెల్లడించలేదు. 

Advertisement
Advertisement