84 Days Amazon Prime Free: Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ట్రిక్ తో 84 రోజులపాటు అమెజాన్ ప్రైమ్ ఫ్రీ..!

ABN , First Publish Date - 2022-09-26T01:17:19+05:30 IST

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య తరచూ పోటీ నడుస్తుంటుంది. ఈ క్రమంలో తమ వినియోగదారులను నిలుపుకొనేందుకు ఆయా టెలికాం..

84 Days Amazon Prime Free: Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. ఈ ట్రిక్ తో 84 రోజులపాటు అమెజాన్ ప్రైమ్  ఫ్రీ..!

దేశీయ టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా మధ్య తరచూ పోటీ నడుస్తుంటుంది. ఈ క్రమంలో తమ వినియోగదారులను నిలుపుకొనేందుకు ఆయా టెలికాం కంపెనీలు వివిధ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. ప్రస్తుతం ఎయిర్‌టెల్‌.. తమ యూజర్లకు గుడ్ న్యూస్ ప్రకటించింది. రెండు ప్రత్యేకమైన ప్లాన్‌ల ద్వారా.. అపరిమిత కాల్స్‌, అదనంగా 3GB వరకు రోజువారీ డేటా, ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటూ 84 రోజులపాటు అమెజాన్ ప్రైమ్‌ను ఫ్రీగా అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు తెలుసుకుందాం..


Airtel రూ. 699 ప్రీపెయిడ్ ప్లాన్

Airtel తన యూజర్ల కోసం రూ. 699 ప్లాన్‌ని అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా 56 రోజుల పాటూ 3GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజూ 100 SMSలను అందిస్తోంది. అలాగే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ ప్లాన్‌తో కూడిన Xstream మొబైల్ ప్యాక్ కూడా 56 రోజుల పాటు అందించబడుతుంది. Xstream మొబైల్ ప్యాక్‌తో కస్టమర్‌లు ఈ క్రింది వివిధ ఛానెళ్లకు యాక్సెస్ పొందవచ్చు. దీంతో పాటూ Apollo-24కి ఉచిత సభ్యత్వాన్ని కూడా తీసుకోవచ్చు. మూడు నెలల పాటు 7 సర్కిల్, ఫాస్టాగ్‌పై రూ. 100 క్యాష్‌బ్యాక్, ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ కూడా ఆస్వాదించవచ్చు.

Amazon Great Indian Festival: అమెజాన్‌ సేల్‌లో అద్భుత అవకాశం.. ఈ 5 వస్తువులు సగం ధరకే..!


Airtel రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్

Airtel యొక్క రూ. 999 ప్రీపెయిడ్ ప్లాన్‌తో వినియోగదారులు 2.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, 100 SMSలను 84 రోజుల చెల్లుబాటుతో పొందుతారు. అలాగే ఈ ప్లాన్ 84 రోజుల పాటు ఉచిత Amazon Prime సభ్యత్వంతో వస్తుంది. Xstream మొబైల్ ప్యాక్ కూడా ఈ ప్లాన్‌తో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో అదనను ఖర్చు లేకుండా ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ యొక్క రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్ కూడా చేర్చబడుతుంది. అదేవిధంగా ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంది. ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రయోజనాలను ఏ ఇతర ఆపరేటర్ ఆఫర్ చేయడం లేదని Airtel చెబుతోంది.

World Biggest Killer: షాకింగ్.. ప్రతీ యేటా 4 కోట్ల మందికి పైగా జనాల ప్రాణాలను తీస్తున్నది ఏంటో తెలుసా..?



Updated Date - 2022-09-26T01:17:19+05:30 IST