Abn logo
Aug 25 2020 @ 19:47PM

రాజమండ్రి, కాకినాడల్లో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌

అమరావతి: భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ రాజమండ్రి, కాకినాడలలో తమ అత్యున్నత ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ హోమ్‌ బ్రాడ్‌‌బ్యాండ్‌ సేవలను ప్రారంభించింది. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ విద్య, ఈ-కామర్స్‌, వీడియో స్ట్రీమింగ్‌‌లను ప్రస్తుతం దేశవ్యాప్తంగా అవసరమవుతున్నాయి. మిగతా నగరాలతో పాటుగా రాజమండ్రి, కాకినాడలలో నాణ్యమైన హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ తమ అత్యాధునిక నెట్‌వర్క్‌తో సరసమైన ప్లాన్‌లలో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తోంది. 300ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌, అప్‌లోడ్‌ స్పీడ్స్‌ అందిస్తోంది. అంతేకాకుండా అత్యున్నత 24x 7 వినియోగదారుల సేవా కేంద్ర మద్దతును ఎయిర్‌టెల్‌ కల్పిస్తోంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌, అత్యంత సౌకర్యవంతమైన ప్లాన్‌లలో లభ్యమవుతోంది. ప్రాథమిక ప్లాన్‌గా రూ.799 100 ఎంబీపీఎస్‌ డేటా వేగం లభిస్తుంది. దీంతో పాటు ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ఆఫర్స్ అయిన 12 నెలల అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యత్వం, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ కంటెంట్‌ ఉచిత చందా (10వేలకు పైగా చిత్రాలు, ప్రోగ్రాంలు‌)తో పాటుగా ఉచిత వింక్‌ మ్యూజిక్‌ చందా(45 లక్షలకు పైగా పాటలు) అందించనుంది.

పరిమిత కాలపు ఆఫర్‌లో భాగంగా, ఎయిర్‌టెల్‌ ఇప్పుడు డబుల్‌ డాటా ప్రయోజనాలను మొదటి ఆరు నెలల కాలానికి రాజమండ్రి, కాకినాడలలోనూతన ఖాతాదారులకు అందించనుంది. ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ఇప్పుడు ఏదైనా ప్లాన్‌తో అపరిమిత డాటా అనుమతి కోసం అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు. తాము అనుభవిస్తున్న వేగంతోనే ఈ అదనపు డేటా కోసం నెలకు వినియోగదారులు రూ.299 చెల్లిస్తే సరిపోతుంది.

వార్షిక రెంటెండ్ ప్యాకేజీలను ఎంచుకున్న వినియోగదారులు అదనంగా 15% వరకూ రాయితీని, ఆరునెలల ప్లాన్ తీసుకుంటే 7.5 % రాయితీని పొందవచ్చు. దీనితో వినియోగదారులు అత్యున్నత విలువ, మరింత అదనపు డేటా ప్రయోజనాలను పొందడంతో పాటుగా అదే ధరలో మరింత కంటెంట్‌నూ పొందగలరు. ఈ ప్రపంచ స్థాయి బ్రాడ్‌బ్యాండ్ అనుభవాన్ని రాజమండ్రి మరియు కాకినాడ అంతటా తీసుకురావడానికి, ఎయిర్‌టెల్ స్థానిక భాగస్వాములతో కలిగి పనిచేస్తోంది. వారి సాయంతో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement