ఎయిర్‌టెల్ షేర్స్‌ను.... మలుపుతిప్పిన ఆ ప్రకటన...

ABN , First Publish Date - 2021-07-23T01:24:55+05:30 IST

ఆ ప్రకటన... భారతి ఎయిర్‌టెల్ షేర్లకు అనూహ్యమైన ఊపునిచ్చింది. కార్పోరేట్, రిటైల్ కస్టమర్ల కోసం కొత్త పోస్ట్‌పెయిడ్ ప్రణాళికలను తాజాగా ఎయిర్‌టెల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎయిర్‌టెల్ షేర్స్‌ను.... మలుపుతిప్పిన ఆ ప్రకటన...

హైదరాబాద్ : ఆ ప్రకటన... భారతి ఎయిర్‌టెల్ షేర్లకు అనూహ్యమైన ఊపునిచ్చింది. కార్పోరేట్, రిటైల్ కస్టమర్ల కోసం కొత్త పోస్ట్‌పెయిడ్ ప్రణాళికలను తాజాగా ఎయిర్‌టెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... గురువారం ఇంట్రా డే ట్రేడ్‌లో బీఎస్‌ఈలో ఎయిర్‌టెల్ షేర్స్ నాలుగు శాతం పెరిగి రూ. 546.80 కు చేరుకున్నాయి.  కరోనా నేపధ్యంలో ... వర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ తారస్థాయిలో ప్రాచుర్యంలోకచ్చిన విషయం తెలలిసిందే.


ఈ నేపధ్యంలోనే అధిక వేగంతో డేటా కూడా వినియోగదారులకు కీలకంగా మారింది. ఈ క్రమంలోనే ‘5 జీ రెడీ’ నెట్‌వర్క్‌తో పాటు  డిజిటల్-ఫస్ట్ కస్టమర్ కేర్ మద్దతుతో డేటా ప్రయోజనాలనందించేందుకు ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను సరళీకృతం చేసింది. ఇందుకు సంబంధించి ఇచ్చిన ప్రకటనే ఎయిర్‌టెల్ వ్యాపారస్థాయిని అనూహ్యంగా పెంచివేసినట్లు చెబుతున్నారు. మరోవైపు ఎయిర్‌టెల్ షేర్లకు కూడా డిమాండ్ ఏర్పడడానికి కూడా దోహదం చేసినట్లు భావిస్తున్నారు. ఇక రిటైల్ కస్టమర్ల కోసం, పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ల ధరలు నెలకు రూ . 399 నుంచి, కార్పొరేట్ వినియోగదారులకు నెలకు రూ . 299 వద్ద ప్రారంభమయ్యేలా ఎయిర్‌టెల్ ప్లాన్లను అందిస్తోంది. 

Updated Date - 2021-07-23T01:24:55+05:30 IST