Airtel 5G Plus: మీ దగ్గర ఈ ఫోన్ ఉంటే.. ఎయిర్‌టెల్ 5జీని ఎంజాయ్ చేయొచ్చు!

ABN , First Publish Date - 2022-10-08T00:21:33+05:30 IST

ఎయిర్‌టెల్ (Airtel) తమ 5జీ సేవలను ప్రారంభించినప్పటికీ ఖాతాదారులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. తాము వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు అందుకు

Airtel 5G Plus: మీ దగ్గర ఈ ఫోన్ ఉంటే.. ఎయిర్‌టెల్ 5జీని ఎంజాయ్ చేయొచ్చు!

న్యూఢిల్లీ: దేశంలోని 8 నగరాల్లో భారతి ఎయిర్‌టెల్ 5జీ (Airtel 5G) సర్వీసులను ప్రారంభించింది. వీటిలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, సిలిగురి, హైదరాబాద్, నాగ్‌పూర్, వారణాసిలలో  5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏడాది చివరినాటికి దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ సేవలను ప్రారంభించాలని కంకణం కట్టుకుంది. వచ్చే ఏడాది చివరి నాటికి దేశంలోని అన్ని పెద్ద నగరాలకు ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ (5G Plus) సేవలను విస్తరించాలని నిర్ణయించుకుంది. 4జీ నెట్‌వర్క్‌తో పోలిస్తే ఎయిర్‌టెల్ 5జీ నెట్‌వర్క్ స్పీడ్ 20, 30 రెట్లు అధికంగా ఉంటుంది. 


ఎయిర్‌టెల్ (Airtel) తమ 5జీ సేవలను ప్రారంభించినప్పటికీ ఖాతాదారులు మాత్రం కొంత ఆందోళన చెందుతున్నారు. తాము వాడుతున్న స్మార్ట్‌ఫోన్లు అందుకు సపోర్ట్ చేస్తాయా? లేదా? అని తెలుసుకోలేక మథనపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్ 5జీ ప్లస్ (Airtel 5G Plus) సేవలకు ఏయే స్మార్ట్‌ఫోన్లు సపోర్ట్ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఎయిర్‌టెల్ 5జీ ప్లస్‌కు సరోప్ట్ చేస్తే స్మార్ట్ ఫోనలు ఇవే.. 

యాపిల్ ఐఫోన్ 12 సిరీస్, 13 సిరీస్, 14 సిరీస్ ఫోన్లు, శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 21ఎఫ్ఈ, శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా, శాంసంగ్ గెలాక్సీ ఎం33, శాసంగ్ ఫ్లిప్ 4, శాంసంగ్ గెలాక్సీ ఎస్‌22 నుంచి శాంసంగ్ ఎం 13 వరకు ఫోన్లు ఎయిర్‌టెల్ 5జీ ప్లస్‌కు సపోర్ట్ చేస్తాయి. అలాగే, రియల్‌మిలో రియల్‌మి 8ఎస్ 5జి, రియల్‌మి ఎక్స్7 మ్యాక్స్ 5జీ, రియల్‌మి నర్జో 30 ప్రొ 5జీ నుంచి రియల్‌మి నర్జో 50 ప్రొ వరకు సపోర్ట్ చేస్తాయి. వీటితో పాటు వన్‌ప్లస్, షావోమి, ఒప్పో, వివో, వన్‌ప్లస్‌‌లోని లేటెస్ట్ ఫోన్లు కూడా 5జీకి సపోర్ట్ చేస్తాయి.

Updated Date - 2022-10-08T00:21:33+05:30 IST