మీ గ్యాడ్జెట్స్‌కు పూర్తిస్థాయి చార్జింగ్ ఉండాలి.. విమానప్రయాణికులకు సూచన.. లేని పక్షంలో..

ABN , First Publish Date - 2022-08-07T03:16:40+05:30 IST

మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు పూర్తి స్థాయిలో చార్జింగ్ చేశాకే ఎయిర్‌పోర్టుకు వెంట తీసుకుని రావాలని విమానప్రయాణికులకు బ్రిటన్ ప్రభుత్వం తాజాగా ఆదేశించింది.

మీ గ్యాడ్జెట్స్‌కు పూర్తిస్థాయి చార్జింగ్ ఉండాలి.. విమానప్రయాణికులకు సూచన.. లేని పక్షంలో..

ఎన్నారై డెస్క్: మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు పూర్తి స్థాయిలో చార్జింగ్(fully charged) చేశాకే ఎయిర్‌పోర్టుకు తీసుకురావాలని విమానప్రయాణికులను బ్రిటన్ ప్రభుత్వం(UK government) తాజాగా ఆదేశించింది. హ్యాండ్ బ్యాగ్‌లో తీసుకువచ్చే ఎలక్ట్రానిక్ సాధనాలన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుందని హెచ్చరించింది. చార్జింగ్ తక్కువగా ఉన్న వాటిని సిబ్బంది విమానంలో అనుమతించకపోవచ్చని తెలిపింది. పూర్తిస్థాయి చార్జింగ్ లేని గ్యాడ్జెట్స్‌ను(Gadgets) అధికారులు జప్తు చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. 


కాగా.. ఈ నిబంధన వెనకున్న కారణాలను బ్రిటిష్ ఎయిర్‌వేస్(British airways) సంస్థ వివరించింది. ‘‘తనిఖీల సందర్భంగా సిబ్బంది.. మీ గ్యాడ్జెట్స్‌ను ఆన్ చేయాలని కోరవచ్చు. ఆ సమయంలో అవి ఆన్ కాకపోతే వాటిని విమానంలోకి అనుమతించరు. కాబట్టి..అటువంటి వాటిని చెక్డ్ బ్యాగేజీలో పెట్టండి. ఇక కనెక్టింగ్ ఫ్టైట్లలో ప్రయాణించేవారు.. ఎలక్ట్రానిక్ ఉపకరణాల చార్జింగ్ పూర్తిగా అయిపోకుండా జాగ్రత్త తీసుకోండి. విమానాశ్రయాల్లో తగినన్ని చార్జింగ్ పాయింట్లు ఉండకపోవచ్చు. అంతేకాకుండా.. కొన్ని సందర్భాల్లో అడాప్టర్లు కూడా వాడాల్సి రావచ్చు’’ అని బ్రిటీష్ ఎయిర్‌వేస్ వివరించింది. 

Updated Date - 2022-08-07T03:16:40+05:30 IST