అద్దంకి ప్రాంతంలో ఎయిర్‌పోర్టు..?

ABN , First Publish Date - 2022-01-28T05:36:51+05:30 IST

జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు చేయాలని రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఎ యిర్‌పోర్టుకు అద్దంకి ప్రాంతంలో పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే రెవెన్యూ అధికారులు రెండు ప్రాంతాలు అనువైనవిగా గుర్తించి ని వేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు పంపేందు కు సిద్ధం చేస్తున్నారు.

అద్దంకి ప్రాంతంలో ఎయిర్‌పోర్టు..?
అద్దంకి-మేదరమెట్ల మధ్య ప్రతిపాదిత ప్రాంతం

 

రెండు ప్రాంతాల వివరాలతో సిద్ధమవుతున్న ప్రతిపాదనలు 


 అద్దంకి, జనవరి 27 : జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు చేయాలని రాష్ట్రప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఎ యిర్‌పోర్టుకు అద్దంకి ప్రాంతంలో పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే రెవెన్యూ అధికారులు రెండు ప్రాంతాలు అనువైనవిగా గుర్తించి ని వేదిక తయారుచేసి ఉన్నతాధికారులకు పంపేందు కు సిద్ధం చేస్తున్నారు. అద్దంకి ప్రాంతం ఒంగోలుతో పాటు జిల్లాలోని దర్శి, పొదిలి, చీమకుర్తి, గుంటూ రు జిల్లాలోని చిలకలూరిపేట, నర్సరావుపేట, వినుకొండ ప్రాంతాలకు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలోనే ఎయిర్‌పోర్టు  ఏర్పాటుకు ఈ ప్రాంతాన్ని గుర్తించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అద్దం కి మండల పరిధిలో పరిశీలన చేయాలని జిల్లా అ ధికారుల నుంచి ఆదేశాలు రావటంతో రెవెన్యూ అ ధికారులు వారం రోజులుగా కసరత్తు చేస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు వెయ్యి ఎకరాలు అవసరం ఉంటుందని, ఆ కోణంలో భూమి ఏ ప్రాంతంలో అందుబాటులో ఉందో గుర్తించి నివేదిక పంపాలని స్థానిక అఽ దికారులకు ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో దక్షి ణ అద్దంకి రెవెన్యూ  పరిధిలో ఉన్న బలరామకృష్ణాపురం పునరావాసకాలనీ సమీపంలో, తిమ్మాయపాలెం సమీపంలో, చక్రాయపాలెం సమీపంలోని ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని రికార్డులు ప రిశీలించారు.  బలరామకృష్ణాపురం సమీపంలో నా మ్‌ రోడ్డు నుంచి కొరిశపాడు సమీపంలో జాతీయ రహదారి మధ్య 1600 ఎకరాలు గుర్తించారు. రెం డు ప్రధాన రహదారుల మధ్య ఉండటంతో అనువైన ప్రాంతంగా కూడా ఉంది. ఇక రామాయపా లెం రెవెన్యూ పరిధిలో తిమ్మాయపాలెం సమీపం లో దర్శి రోడ్డు, కుంకుపాడు రోడ్డు మధ్య 1400 ఎకరాలు కూడా అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. చక్రాయపాలెం వద్ద 600ఎకరాలు మాత్రమే అందు బాటులో ఉండటంతో పరిగణనలోకి తీసుకోకుండా పక్కనపెట్టినట్లు తెలుస్తోంది. జిల్లాలో మరో రెండు, మూడు ప్రాంతాల్లో కూడా పరిశీలన చేయాలని ఆ యా మండలాల రెవెన్యూ అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. ఎయిర్‌పో ర్టు ఏర్పాటు ప్రతిపాదనల విషయం ప్రస్తుతం అ ద్దంకిలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే అ ద్దంకిలో రియల్‌ ఎస్టేట్‌ ధరలు చుక్కలను చూస్తుండగా ఎయిర్‌పోర్టు ఏర్పాటు ప్రతిపాదనలను బూచి గా చూపి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు మరింత భూమ్‌ సృష్టించే అవకాశం కూడా ఉందని పలువు రు అభిప్రాయపడుతున్నారు. అయితే చివరకు ఎ యిర్‌పోర్టు ఏ ప్రాంతంలో ఏర్పాటు అవుతుందో వే చి చూడాల్సి ఉంది.

రెండు ప్రాంతాలను గుర్తించి నివేదిక 

తహసీల్దార్‌ ప్రభాకరరావు 

ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు వెయ్యి ఎకరాలు అవసరమని, అందుబాటులో ఉన్న భూమిని పరిశీలన చే యాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అద్దంకి మండలంలో రెండు ప్రాంతాలను గుర్తించాం. దక్షిణ అద్దంకి రెవెన్యూ పరిధిలో 1600 ఎకరాలు, తిమ్మాయపాలెం  వద్ద 1400ఎకరాలు ఉ న్నాయి. రెండు ప్రాంతాలపై పూర్తి నివేదిక తయా రుచేసి రెండు, మూడు రోజులలో ఉన్నతాధికారుల కు పంపేందుకు సిద్ధం చేస్తున్నాం.




Updated Date - 2022-01-28T05:36:51+05:30 IST