ప్రభుత్వ నిర్వహణలో ఉన్న ఎయిరిండియా దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మళ్లీ సొంతగూటికి చేరింది. కేంద్ర ప్రభుత్వం గురువారం అధికారికంగా టాటా గ్రూప్‌నకు అప్పగించింది. ‘‘ఎయిరిండియా టేకోవర్ పూర్తయినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాం. ప్రపంచంలోనే మేటి విమానయాన సంస్థగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నాం’’అని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. ఎయిరిండియా ఉద్యోగులను టాటా గ్రూప్‌లోకి స్వాగతిస్తూ చంద్రశేఖరన్ ఈ సందర్భంగా లేఖ రాశారు. భారత ఎయిర్‌లైన్స్ చరిత్రలో ఈ రోజు సరికొత్త అధ్యాయం మొదలైంది. దేశ అవసరాలకు తగ్గట్టుగా ఎయిర్‌లైన్స్‌ను అభివృద్ధి చేసేందుకు కలిసి పనిచేద్దామని అన్నారు.