Airhostess Locks Man Who Raped Her: తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని గదిలో బంధించి.. పోలీసులకు కాల్ చేసిన ఎయిర్‌హోస్టెస్!
ABN , First Publish Date - 2022-09-28T02:14:50+05:30 IST
తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని గదిలో బంధించిన ఓ ఎయిర్‌హోస్టెస్(Airhostess) ఆపై పోలీసుకు ఫోన్ చేసి
న్యూఢిల్లీ: తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని గదిలో బంధించిన ఓ ఎయిర్‌హోస్టెస్(Airhostess) ఆపై పోలీసుకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు రాగానే అతడిని వారికి అప్పగించింది. మరొకరైతే తనపై జరిగిన అఘాయిత్యానికి కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. అయితే, ఈమె మాత్రం ధైర్యం కోల్పోకుండా అతడి నుంచి తప్పించుకుని బయటకు వచ్చి అతడిని గదిలో బంధించింది. ఎయిర్‌హోస్టెస్(Airhostess) సాహసంపై సర్వత్ర ప్రశంసలు కురుస్తున్నాయి.
దక్షిణ ఢిల్లీలోని మెహరౌలి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల బాధితురాలు ఓ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్‌హోస్టెస్(Airhostess)గా పనిచేస్తోంది. ఖాన్పూరుకు చెందిన హర్జీత్ యాదవ్ ఓ రాజకీయ పార్టీలో బ్లాక్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. నెలన్నర క్రితమే ఆమెకు పరిచయమయ్యాడు. తాగినమత్తులో ఎయిర్‌హోస్టెస్(Airhostess) ఇంటికి వచ్చిన హర్జీత్ యాదవ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ వెంటనే తేరుకున్న బాధితురాలు నిందితుడిని గదిలో బంధించి 112 నంబరుకు ఫోన్ చేసి విషయం చెప్పింది.
వెంటనే బాధితురాలి ఇంటికి చేరుకున్న పోలీసులు నిందితుడు హర్జీత్ యాదవ్‌కు సంకెళ్లు వేసినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ చందన్ చౌదరి తెలిపారు. బాధితురాలి(Airhostess) ఫిర్యాదు ఆధారంగా నిందితుడిపై అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని జుడీషియల్ కస్టడీకి తరలించినట్టు చందన్ చౌదరి పేర్కొన్నారు.