చార్జీలపై 15 శాతం బాదేందుకు సిద్ధమైన విమానయాన సంస్థలు

ABN , First Publish Date - 2022-06-17T02:58:02+05:30 IST

చార్జీల పెంపునకు విమానయాన సంస్థలు సిద్ధమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గరిష్ఠ

చార్జీలపై 15 శాతం బాదేందుకు సిద్ధమైన విమానయాన సంస్థలు

న్యూఢిల్లీ: చార్జీల పెంపునకు విమానయాన సంస్థలు సిద్ధమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. ముడిచమురు ధరలు పెరగడంతోపాటు డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన విషయాన్ని ప్రస్తావించిన ప్రైవేటు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ టికెట్ ధరల పెంపు తప్పదని సంకేతాలు ఇచ్చింది.


దేశీయ చమురు అవసరాల్లో 85 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నామని, రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతుల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. కాబట్టి విమాన టికెట్ల ధర పెంచక తప్పని నెలకొందని అన్నారు. టికెట్ ధరలు కనీసం 10-15 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. జూన్ 2021 నుంచి ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ధర 120 శాతానికి పైనే పెరిగినట్టు పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-17T02:58:02+05:30 IST