వేసవిలో పెరగనున్న విమాన సర్వీసులు...

ABN , First Publish Date - 2022-03-12T01:00:13+05:30 IST

కిందటి సీజన్‌లో 22,980 గా ఉన్న భారత విమాన సర్వీసులు... తమ దేశీయ సర్వీసులను 10.1 శాతం మేర పెంచి, రానున్న వేసవి షెడ్యూల్‌లో 25,309 వీక్లీ విమానాలకు చేరుకోనున్నాయి.

వేసవిలో పెరగనున్న విమాన సర్వీసులు...

ముంబై : కిందటి సీజన్‌లో 22,980 గా ఉన్న భారత విమాన సర్వీసులు... తమ దేశీయ సర్వీసులను 10.1 శాతం మేర పెంచి, రానున్న వేసవి షెడ్యూల్‌లో 25,309 వీక్లీ విమానాలకు చేరుకోనున్నాయి. ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ(డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్  శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది.  ఇండిగో తన దేశీయ విమానాలను 2022 వేసవిలో 11,130 వీక్లీ సర్వీసులకు(10.4 శాతం మేర) పెంచింది. కోవిడ్ నేపథ్యంలో... ప్రయాణ పరిమితులు గత 24 నెలల్లో భారతీయ విమానయాన పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేశాయన్న విషయం తెలిసిందే. కాగా... కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్లు తగ్గుముఖం పట్టడంతో... గత రెండు వారాలుగా విమాన ప్రయాణాలు పుంజుకున్నాయి. ఎయిర్‌పోర్ట్ స్లాట్‌లపై గత నెలలో జరిగిన వర్చువల్ మీటింగ్ తర్వాత ఇండియన్ క్యారియర్‌ల వేసవి షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. 

Updated Date - 2022-03-12T01:00:13+05:30 IST