గాల్లో తేలిపోదామా?

ABN , First Publish Date - 2021-10-19T07:16:08+05:30 IST

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పుంజుకుంటోంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయి....

గాల్లో తేలిపోదామా?

దేశీయంగా పెరుగుతున్న విమాన ప్రయాణికులు

ఒక్క రోజులో 3,27,923 మంది ప్రయాణం 


న్యూఢిల్లీ, అక్టోబరు 18: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పుంజుకుంటోంది.  ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఇందుకు దోహదపడుతున్నాయి. తాజాగా ఆదివారం 2,372 విమానాల్లో 3,27,923 మంది ప్రయాణించినట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సోమవారం పేర్కొన్నారు. కొవిడ్‌ మహమ్మారి ప్రారంభమైన తర్వాత ఆదివారం దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ అత్యధిక స్థాయికి చేరిందని, కేంద్ర ప్రభుత్వ విధానాలు ఇందుకు కారణమని ట్వీట్‌ చేశారు. ఇంతకు ముందెన్నడూ లేని సవాళ్లను ఎదుర్కొంటూ దేశీయ విమానయాన రంగం వృద్ధి చెందుతోందని, సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితికి రావడానికి తాము అన్ని ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. మహమ్మారికి ముందు దేశీయంగా రోజుకు దాదాపు 4.25 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. లాక్‌డౌన్‌ వల్ల 2020 మార్చి 25 నుంచి మే 25 వరకు దేశీయ విమానాలను కేంద్రం రద్దు చేసింది. ఆ తర్వాత 33 శాతం సామర్థ్యంతో దేశీయ సర్వీసులను ప్రభుత్వం పునరుద్ధరించింది.  ఈ నెల 18 నుంచి సామర్థ్యానికి సంబంధించి ఆంక్షలేమీలేకుండా దేశీయ విమాన సర్వీసులను ఎయిర్‌లైన్స్‌ నడపవచ్చని ఇటీవలే కేంద్రం ప్రకటించింది. 

Updated Date - 2021-10-19T07:16:08+05:30 IST