అమెరికా, కెనడాలో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త..!

ABN , First Publish Date - 2020-06-04T05:37:09+05:30 IST

అమెరికా, కెనడాలో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ‘వందే భారత్ మిషన్’లో భాగంగా 75 ప్రత్యేక విమానాలను నడపనున్న

అమెరికా, కెనడాలో చిక్కుకున్న భారతీయులకు శుభవార్త..!

న్యూఢిల్లీ: అమెరికా, కెనడాలో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ‘వందే భారత్ మిషన్’లో భాగంగా 75 ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో యావత్ ప్రపంచ స్వీయ నిర్భంధంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టిన ప్రపంచ దేశాలు క్రమంగా లాక్‌డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత ప్రభుత్వం కూడా నిబంధనలను క్రమంగా ఎత్తేస్తూ.. విదేశాల్లో చిక్కుకున్న వారి స్వదేశానికి తరలించడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ‘వందే భారత్ మిషన్’ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమెరికా, కెనడాలో చిక్కుకున్న భారతీయులను ఇండియాకు తరలించేందుకు ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా జూన్ 9 నుంచి 30 వరకు 75 ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. జూన్ 5, సాయంత్రం 5 గంటల నుంచి ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చిని వెల్లడించింది. అయితే విమానాలు నడిపే ప్రాంతాలను మాత్రం ఎయిర్ ఇండియా వెల్లడించలేదు. కాగా.. ‘వందే భారత్ మిషన్’ మూడవ విడతలో భాగంగా జూన్ 11-30వరకు యూఎస్, కెనడాలకు 70 ప్రత్యేక విమానాలను నడపనున్నట్లు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ‘వందే భారత్ మిషన్’‌లో భాగంగా  విదేశాల్లో చిక్కుకున్న దాదాపు 57వేల మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 


Updated Date - 2020-06-04T05:37:09+05:30 IST