ఎన్నారై డెస్క్: యూఏఈ నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులను ఉద్దేశించి ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. యూఏఈ నుంచి భారత్ వచ్చే ప్రయాణికులు పూర్తి స్థాయిలో కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే.. ప్రయాణానికి ముందు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది. అంతేకాకుండా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ను ఎయిర్ సువిధా పోర్టల్లో అప్లోడ్ చేయాలని వెల్లడించింది.
రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణికులు.. తమ ప్రయాణానికి 72 గంటల ముందు కొవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. నెగెటివ్ సర్టిఫికెట్ను ఎయిర్ సువిధా పోర్టల్లో అప్లోడ్ చేయాల్సిందిగా చెప్పింది. ప్రయాణికులు తమ 14రోజుల ట్రావెల్ హిస్టరీతోపాటు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపింది. ఈ నిబంధనలు పాటించని ప్రయాణికుల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. విమానం ఎక్కేందుకు అనుమతించబోమని తేల్చి చెప్పింది. అంతేకాకుండా 5ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్ టెస్ట్ నుంచి మినహాయింపు ఉన్నట్టు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి