ఎయిర్ ఇండియాలో 48 మంది పైలెట్ల తొలగింపు

ABN , First Publish Date - 2020-08-15T15:37:01+05:30 IST

దేశీయ విమానయాన రంగ దిగ్గజమైన ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ అర్దరాత్రి తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది....

ఎయిర్ ఇండియాలో 48 మంది పైలెట్ల తొలగింపు

అర్దరాత్రి ఉత్తర్వులు

న్యూఢిల్లీ : దేశీయ విమానయాన రంగ దిగ్గజమైన ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ అర్దరాత్రి తీసుకున్న నిర్ణయం కలకలం రేపింది. కరోనా సంక్షోభంం వల్ల నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియా 48 మంది పైలెట్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలగింపునకు గురైన 48 మంది పైలెట్లు గత ఏడాది రాజీనామా చేస్తూ 6 నెలల నోటీసు ఇచ్చినా, వారు దాన్ని ఉపసంహరించుకున్నారు. ఎయిర్ బస్ విమానాలు నడుపుతున్న పైలెట్లను తొలగించింది. పైలెట్ల తొలగింపు ఉత్తర్వులను రద్దు చేయాలని ఇండియన్ కమర్షియల్ పైలట్స్ అసోసియేషన్ (ఐసిపిఎ) ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బన్సాల్ ను కోరింది.

Updated Date - 2020-08-15T15:37:01+05:30 IST