Air India కొత్తగా 200 విమానాల కొనుగోలుకు ప్రణాళిక

ABN , First Publish Date - 2022-06-20T17:56:35+05:30 IST

టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 200 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది

Air India కొత్తగా 200 విమానాల కొనుగోలుకు ప్రణాళిక

న్యూఢిల్లీ: టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా 200 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. కొత్త విమానాల్లో 70 శాతం ఇరుకైన జెట్ సర్వీసులను కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుందని ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది జనవరి 27వతేదీన టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసింది.ఎయిర్‌బస్, బోయింగ్‌ విమానాల కొనుగోలుకు చర్చలు కొనసాగుతున్నాయని ఆయా వర్గాలు తెలిపాయి.ఎయిర్‌బస్ ఎ350 వంటి విశాలమైన విమానంలో పెద్ద ఇంధన ట్యాంక్ ఉంటుంది. ఈ ఎయిర్ బస్ భారతదేశం-యూఎస్ మార్గాల వంటి ఎక్కువ దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.ఎయిర్ ఇండియా 2006వ సంవత్సరం నుంచి 111 విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డరు ఇచ్చినప్పటి నుంచి ఒక్క విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదు. 



ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ 78వ వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా ఎయిర్ ఇండియా 200 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని యోచిస్తున్నట్లు విమానయాన పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ప్రకారం ఈ విమానయాన సంస్థకు మొత్తం 49 వైడ్-బాడీ విమానాలున్నాయి.ఎయిర్ ఇండియా 18 బోయింగ్ బి 777, 4 బోయింగ్ బి 747,27 బోయింగ్ బి787 విమానాలున్నాయి. 

Updated Date - 2022-06-20T17:56:35+05:30 IST