హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎయిరిండియా విమానాన్ని అధికారులు నిలిపివేశారు. జగదల్‌పూర్ వెళ్లాల్సిన విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. సమాచారం లేకుండా విమానం నిలిపివేశారని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణం అనుకూలిస్తే జగదల్‌పూర్‌కు విమానం పంపిస్తామని అధికారులు తెలిపారు.