ఖ‌తార్ వెళ్లే వారికి.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కొత్త ప్ర‌యాణ మార్గ‌ద‌ర్శ‌కాలివే!

ABN , First Publish Date - 2021-06-24T15:10:10+05:30 IST

భార‌తీయ‌ బ‌డ్జెట్ క్యారియ‌ర్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఖ‌తార్ వెళ్లే ప్ర‌యాణికుల‌కు కొత్త ప్ర‌యాణ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది.

ఖ‌తార్ వెళ్లే వారికి.. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కొత్త ప్ర‌యాణ మార్గ‌ద‌ర్శ‌కాలివే!

దోహా: భార‌తీయ‌ బ‌డ్జెట్ క్యారియ‌ర్ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఖ‌తార్ వెళ్లే ప్ర‌యాణికుల‌కు కొత్త ప్ర‌యాణ మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ప్ర‌యాణికులు త‌ప్ప‌స‌నిస‌రిగా పీసీఆర్ టెస్టు నెగెటివ్ స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. అలాగే ప్ర‌త్యేక‌మైన పోర్ట‌ల్ నుంచి 10 రోజుల పాటు ఉండేందుకు హోట‌ల్ రూమ్ బుక్ చేసుకోవ‌డం కూడా త‌ప్ప‌నిస‌రి. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ కొత్త ప్ర‌యాణ మార్గ‌ద‌ర్శ‌కాల పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి. 

* ఐసీఎంఆర్ ఆమోదం తెలిపిన లేదా ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి తీసుకున్న నెగెటివ్ కొవిడ్‌-19 పీసీఆర్ టెస్టు స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి.


* విమానం బ‌య‌ల్దేరడానికి 48 గంట‌ల ముందు క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాలి


* త‌ప్ప‌నిస‌రిగా స్మార్ట్‌ఫోన్‌లో Ehteraz app డౌన్‌లోడ్ చేసుకోవాలి


* ప్ర‌యాణికులు త‌ప్ప‌నిస‌రిగా ఈ సర్టిఫికెట్ల‌ ప్రింట్ కాపీలు తీసుకెళ్లాలి. a) నెగెటివ్ పీసీఆర్ టెస్ట్ స‌ర్టిఫికెట్, b) క్వారంటైన్‌లో ఉండేందుకు హోట‌ల్ బుకింగ్‌కు సంబంధించిన ప్రూఫ్‌, c) ప్రవేశ అనుమతి, d) నింపిన హెల్త్ అసెస్మెంట్ ఫారం


* వ్యాక్సినేష‌న్ పూర్తి చేసుకున్న వారు దాని తాలూకు స‌ర్టిఫికెట్ క‌లిగి ఉండాలి


*10 రోజుల క్వారంటైన్ కోసం ‘Discover Qatar’ పోర్ట‌ల్ నుంచి మాత్ర‌మే హోట‌ల్ రూమ్ బుక్ చేసుకోవాలి



Updated Date - 2021-06-24T15:10:10+05:30 IST