ఈ ఏడాది రూ.5,000 కోట్ల ఆదాయం

ABN , First Publish Date - 2020-02-14T06:27:49+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో సుమారు రూ.5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని ఎయిర్‌ ఇండియా (ఏఐ) ఎక్స్‌ప్రెస్‌ అంచనా వేస్తోంది. విమాన సర్వీసులు పెరగటం...

ఈ ఏడాది రూ.5,000 కోట్ల ఆదాయం

ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ అంచనా 


ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో సుమారు రూ.5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని ఎయిర్‌ ఇండియా (ఏఐ) ఎక్స్‌ప్రెస్‌ అంచనా వేస్తోంది. విమాన సర్వీసులు పెరగటం, ఇంధన ఖర్చు తగ్గటం వంటి అంశాలు రాబడులు పెరిగేందుకు దోహదకారిగా ఉండనున్నాయని పేర్కొంది. మాతృసంస్థ ఎయిర్‌ ఇండియాతో పాటు ఏఐ ఎక్స్‌ప్రె్‌సను కూడా విక్రయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2018-20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ. 4171.5 కోట్ల ఆదాయంపై  రూ. 168.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.5,000 కోట్లు అధిగమిస్తుందని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మార్కును దాటడం ఇదే తొలిసారి అవుతుందని భావిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంతో పోలిస్తే.. ఈ ఏడాది నిర్వహణ ఆదాయం 40 శాతం పెరిగి రూ. 3124.34 కోట్లకు చేరిందని వివరించింది. ప్రస్తుతం ఏఐ వారానికి 651 విమానాలను నడుపుతోంది.  

Updated Date - 2020-02-14T06:27:49+05:30 IST