Air India ఇలా చేసిందేంటి..! 85ఏళ్ల మహిళకు చేదు అనుభవం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న NRIలు

ABN , First Publish Date - 2021-11-18T00:33:41+05:30 IST

భారత్‌కు చెందిన 85ఏళ్ల మహిళకు చేదు అనుభవం ఎదురైంది. జోధ్‌పూర్ వచ్చేందుకు శాన్ ప్రాన్సిస్కోలోని విమానాశ్రయం చేరుకున్న ఆమెను.. విమానం ఎక్కనీయకుండా ఎయిర్ ఇండియా సిబ్బంది అడ్డుకున్నారు. దీం

Air India ఇలా చేసిందేంటి..! 85ఏళ్ల మహిళకు చేదు అనుభవం.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న NRIలు

ఎన్నారై డెస్క్: భారత్‌కు చెందిన 85ఏళ్ల మహిళకు చేదు అనుభవం ఎదురైంది. జోధ్‌పూర్ వచ్చేందుకు శాన్ ప్రాన్సిస్కోలోని విమానాశ్రయం చేరుకున్న ఆమెను.. విమానం ఎక్కనీయకుండా ఎయిర్ ఇండియా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆమె షాకైంది. ఆ తర్వాత వారు చెప్పింది విని.. ఆశ్చర్యపోయింది. ఎయిర్ ఇండియా సిబ్బంది చేసిన పని.. బయటికి తెలియడంతో కొందరు ఎన్నారైలు స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన 85ఏళ్ల కమనీ భండారి అనే అనే మహిళ కొన్నేళ్లుగా తన కొడుకుతోపాటు అమెరికాలోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా స్వస్థలానికి రావాలని ఆమె భావించారు. విషయం తన కుమారుడికి చెప్పడంతో.. ఆయన శాన్ ఫ్రాన్సిక్కో నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా జోధ్‌పూర్‌‌కు ప్రయాణించేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం రోజు ఆమె బయల్దేరి.. శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం ఎయిర్ పోర్ట్‌లో సెక్యూరిటీ చెకప్ ప్రక్రియను పూర్తి చేసుకుని.. బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నారు. తీరా విమానం ఎక్కేసమయానికి ఆమెను.. ఎయిర్ ఇండియా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో ఆమె షాకైంది. ఈ క్రమంలోనే ‘విమానంలో సీట్లు అన్ని ప్రయాణికులతో నిండిపోయాయని.. మీకు సీటు లేదు’ అని చెప్పడంతో ఆమె కంగుతింది. 



అయితే.. ఈ విషయం ఆమె కుమారుడికి తెలియడంతో ఆయన ఆగ్రహానికి లోనయ్యారు. సమయానికి సీట్లు లేవని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. దీంతో.. మరో విమానంలో ఆమె ప్రయాణించేందుకు ఎయిర్ ఇండియా సిబ్బంది అవకాశం కల్పించారు. అయితే దానికి ఆమె కుమారుడు ఒప్పుకోలేదు. కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా జోద్‌పూర్‌కు వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంటే.. మరో విమానంలో కేవలం ఢిల్లీ వరకు వెళ్లాలి అనడం ఏంటని అసహనం వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రధాన మంత్రి కార్యాలయం, పౌర విమాన మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో కొందరు ఎన్నారైలు విషయం తెలుసుకుని.. ఎయిర్ ఇండియాపట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పందించారు. ఆమె తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్టు చెప్పారు. అంతేకాకుండా యూఎస్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ నిబంధనల ప్రకారం.. 1,550 డాలర్లను చెల్లిస్తున్నట్టు చెప్పారు. 




Updated Date - 2021-11-18T00:33:41+05:30 IST