సిబ్బందిని ప్రభుత్వ హౌసింగ్ కాలనీలు ఖాళీ చేయమన్న Air India

ABN , First Publish Date - 2022-05-24T19:31:53+05:30 IST

జూలై 26వ తేదీకల్లా ప్రభుత్వ హౌసింగ్ కాలనీలను (Housing colonies) ఖాళీ చేయాల్సిందిగా తమ సిబ్బందిని ఎయిర్ ఇండియా..

సిబ్బందిని ప్రభుత్వ హౌసింగ్ కాలనీలు ఖాళీ చేయమన్న Air India

న్యూఢిల్లీ: జూలై 26వ తేదీకల్లా ప్రభుత్వ హౌసింగ్ కాలనీలను (Housing colonies) ఖాళీ చేయాల్సిందిగా తమ సిబ్బందిని ఎయిర్ ఇండియా (Air india) ఒక అధికారిక డాక్యుమెంట్‌లో కోరింది. గత ఏడాది ఎయిర్ ఇండియా బిడ్‌ను టాటా గ్రూప్ (Tata Group) సొంతం చేసుకుంది. పెట్టుబడుల ఉపసంహరణ నిబంధనల ప్రకారం హౌసింగ్ కాలనీలు వంటి ఎయిర్‌లైన్ నాన్-కోర్ అస్సెట్స్ (Non- core Assets) యథాప్రకారం ప్రభుత్వంతోనే ఉంటాయి. ఎయిర్ ఇండియాకు రెండు ప్రధాన హౌసింగ్ కాలనీలు ఢిల్లీ, ముంబైలో ఉన్నాయి.


కంపెనీ అకామిడేషన్‌ను జూలై 26లోగా ఖాళీ చేసేలా సిబ్బందికి రిమైండర్ పంపాలని ఎయిర్ ఇండియా స్పెసిఫిక్ ఆల్టర్నేటివ్ మెకానిజం (ఏఐఎస్ఏఎం) తమకు సూచించిందని, ఆ నిర్ణయానికి అనుగుణంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామని ఆ అధికారిక డాక్యుమెంట్ పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణ తరువాత ఎయిర్ ఇండియా నాన్ కోర్ అస్సెట్ల అమ్మకం ద్వారా రుణాల నుంచి బయటపడేందుకు ఏఐఓహెచ్ఎల్‌ను 2019లో కేంద్రం ఏర్పాటు చేసింది. ఎయిర్ ఇండియా పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏర్పాటైన మంత్రుల బృందంలో (ఏఐఎస్ఏఎం) కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పౌరవిమానయాన శాఖ మత్రి జ్యోతిరాదిత్య సింధియా ఉన్నారు.

Updated Date - 2022-05-24T19:31:53+05:30 IST