కువైట్ నుంచి ఎయిరిండియా, ఇండిగో 12 విమాన సర్వీసులు
ABN , First Publish Date - 2020-08-13T15:25:34+05:30 IST
భారతీయ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా, ఇండిగోలు 17వ తేదీ వరకు(సోమవారం) కువైట్ నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు 12 విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించాయి.
కువైట్ సిటీ: భారతీయ ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియా, ఇండిగోలు 17వ తేదీ వరకు(సోమవారం) కువైట్ నుంచి భారతదేశంలోని వివిధ నగరాలకు 12 విమాన సర్వీసులు నడపనున్నట్లు ప్రకటించాయి. వీటిలో ఇండిగో 5, ఎయిరిండియా 7 విమానాలు నడపనున్నాయి. వీటికి సంబంధించిన టికెట్ బుకింగ్స్ కువైట్‌లోని ఆయా ఎయిర్ లైన్స్ ఆఫీసుల్లో చేసుకోవచ్చు.
ఈ విమాన సర్వీసుల షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి...
13 ఆగస్టు 10:55 - కొచ్చి - ఇండిగో
14 ఆగస్టు 12:25 - చెన్నై - ఇండిగో
14 ఆగస్టు 14:15 - న్యూ ఢిల్లీ - ఎయిర్ ఇండియా
14 ఆగస్టు 16:25 - విజయవాడ - ఎయిర్ ఇండియా
15 ఆగస్టు 06:55 - భువనేశ్వర్ - ఇండిగో
15 ఆగస్టు 14:15 - ముంబై - ఎయిర్ ఇండియా
15 ఆగస్టు 16:25 - హైదరాబాద్ - ఎయిర్ ఇండియా
16 ఆగస్టు 06:10 - జైపూర్ - ఇండిగో
16 ఆగస్టు 16:25 - చెన్నై - ఎయిర్ ఇండియా
16 ఆగస్టు 16:25 - బెంగళూరు - ఎయిర్ ఇండియా
17 ఆగస్టు 16:25 - న్యూ ఢిల్లీ - ఎయిర్ ఇండియా
17 ఆగస్టు 16:30 - హైదరాబాద్ - ఇండిగో
వీటితో పాటు కువైట్ ఎయిర్‌వేస్, జజీరా ఎయిర్‌లైన్స్ కూడా భారత్‌కు విమానాలు నడపనున్నాయి.