గాలిలోకి కాల్పులు.. mlaపై కేసు

ABN , First Publish Date - 2021-10-17T17:20:29+05:30 IST

విజయదశమి వేడుకలలో భాగంగా కోలారు జిల్లా మాలూరు ఎమ్మెల్యే కేవై నంజేగౌడ గాలిలోకి కాల్పులు జరిపిన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాలూరు తాలూకా కొమ్మనహళ్లిలో జమ్మిచెట్టు వద్ద ఆయు

గాలిలోకి కాల్పులు.. mlaపై కేసు

బెంగళూరు: విజయదశమి వేడుకలలో భాగంగా కోలారు జిల్లా మాలూరు ఎమ్మెల్యే కేవై నంజేగౌడ గాలిలోకి కాల్పులు జరిపిన మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మాలూరు తాలూకా కొమ్మనహళ్లిలో జమ్మిచెట్టు వద్ద ఆయుధాలకు శుక్రవారం పూజలు నిర్వహించారు. ఇదే సందర్భంలో నాటు తుపాకీతో గాలిలోకి నాలుగురౌండ్లు కాల్పులు జరిపారు. సదరు వీడియోలు వైరల్‌ అయ్యాయి. లైసెన్సు కల్గినవారు మాత్రమే నాటు తుపాకీని వాడాలనే నిబంధనలు ఉన్నాయి. ఎమ్మెల్యే ఉల్లంఘనకు పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే నంజేగౌడ సోదరుడు ఈరేగౌడ పేరిట తుపాకీ లైసెన్సు ఉంది. అయితే ఎమ్మెల్యే బహిరంగ ప్రదేశంలో తుపాకీ వాడిన మేరకు కేసు నమోదు చేశారు. 


Updated Date - 2021-10-17T17:20:29+05:30 IST