ఎయిర్‌ బెలూన్‌!

ABN , First Publish Date - 2022-06-01T07:13:00+05:30 IST

ముందుగా ఒక కలర్‌ పేపర్‌ తీసుకుని హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ అవుట్‌లైన్‌ గీసి కత్తిరించండి.

ఎయిర్‌ బెలూన్‌!

కావలసినవి

నాలుగు రకాల రంగుల పేపర్లు, దారం, కత్తెర, జిగురు, కార్డ్‌బోర్డ్‌.


ఇలా చేయాలి...

ముందుగా ఒక కలర్‌ పేపర్‌ తీసుకుని హాట్‌ ఎయిర్‌ బెలూన్‌ అవుట్‌లైన్‌ గీసి కత్తిరించండి.

తరువాత మిగతా మూడు పేపర్లు కూడా అదే సైజులో కత్తిరించాలి.

బొమ్మలో చూపిన విధంగా ప్రతి పేపర్‌ను మధ్యలోకి మడవండి. అలా నాలుగు పేపర్లు మడవాలి.

ఇప్పుడు ఒకదానిపైన ఒకటి జిగురు సహాయంతో బొమ్మలో చూపిన విధంగా అతికించాలి.

దారంను రెండు సమాన భాగాలుగా తీసుకోవాలి. కార్డ్‌బోర్డ్‌ను కత్తిరించి జిగురు సహాయంతో చిన్నబాస్కెట్‌లా తయారుచేసుకోవాలి.

దారం సహాయంతో బాస్కెట్‌ను ఎయిర్‌ బెలూన్‌కు అంటించాలి.

Updated Date - 2022-06-01T07:13:00+05:30 IST