Air Arabia: ముంబైకి కొత్త విమాన సర్వీస్

ABN , First Publish Date - 2022-04-22T14:56:56+05:30 IST

యూఏఈకి చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా అబుదాబి భారత్‌లోని ముంబై నగరానికి కొత్త విమాన సర్వీస్‌ను ప్రకటించింది.

Air Arabia: ముంబైకి కొత్త విమాన సర్వీస్

అబుదాబి: యూఏఈకి చెందిన బడ్జెట్ క్యారియర్ ఎయిర్ అరేబియా అబుదాబి భారత్‌లోని ముంబై నగరానికి కొత్త విమాన సర్వీస్‌ను ప్రకటించింది. 2022 మే 12 నుంచి ఈ సర్వీస్‌ను నడపనున్నట్లు వెల్లడించింది. అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 2020 జూలైలో సర్వీసులు ప్రారంభించిన తర్వాత నుంచి ఎయిర్ అరేబియాకు ఇది 20వ రూట్. కాగా, భారత్‌లోని కాలికట్, చెన్నై, జైపూర్, కరాచీ, కొచ్చి, తిరువనంతపురం నగరాల తర్వాత ఎయిర్ అరేబియా సర్వీస్ నడుపుతున్న ఏడో నగరం ముంబై. ఇప్పుడు ప్రయాణికులు అబుదాబి, ముంబై మధ్య నేరుగా తమ విమాన టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ బుకింగ్ కోసం ఎయిర్ అరేబియా వెబ్‌సైట్ ద్వారా గానీ, కాల్ సెంటర్‌కు గానీ కాల్ చేయవచ్చు. లేదా ట్రావెల్ ఏజెన్సీల ద్వారా కూడా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 

Updated Date - 2022-04-22T14:56:56+05:30 IST