ఐటీ..పిటీ !

ABN , First Publish Date - 2020-08-15T11:26:53+05:30 IST

కరోనా ఆదా యపు పన్ను శాఖ ఆదాయానికి గండి కొట్టింది. రిజర్వ్‌ బ్యాంకు ఆదేశాలతో బ్యాంకు రుణ గ్రహీతలకు ఆరు నెలల పాటు ఈఎంఐలపై మారటోరియం

ఐటీ..పిటీ !

ఐదు కార్యాలయాల్లో అంతంతమాత్రంగానే రిటర్న్స్‌ 

ఐటీ శాఖకు కరోనా దెబ్బ

వ్యక్తిగత రిటర్న్స్‌కు నవంబర్‌ 30 వరకూ గడువు 


పాలకొల్లు, ఆగస్టు 14 : కరోనా ఆదా యపు పన్ను శాఖ ఆదాయానికి గండి కొట్టింది. రిజర్వ్‌ బ్యాంకు ఆదేశాలతో బ్యాంకు రుణ గ్రహీతలకు ఆరు నెలల పాటు ఈఎంఐలపై మారటోరియం ప్రకటించిన విధంగానే.. ఆదాయపన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు కొన్ని వెసులుబాట్లు కల్పించింది. రిటర్న్స్‌ దాఖలు చేయడానికి నవంబరు నెలాఖరు వరకూ గడువు ఇచ్చారు.


రూ. 2 కోట్లు పైబడిన (44 ఏ,బీ) ఖాతాలకు ఆడిట్‌ పూర్తయి ఉంటే రిటర్న్స్‌ దాఖలు చేయడానికి వచ్చే నెలాఖరు వరకూ గడువు ఇచ్చారు. జిల్లాలో ఇప్పటికి కేవలం వందల సంఖ్యలోనే రిటర్న్స్‌ దాఖలు అయినట్లు తెలుస్తున్నది. జిల్లాలో ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లులో ఆదాయపన్ను శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ఆయా కార్యాలయాల్లో 2019-20 ఎసెస్‌మెంట్‌ ఇయర్‌కు సుమారు రూ. 150 కోట్ల ఆదాయం వచ్చింది. 2020-21 ప్రస్తుత అసెస్‌మెంట్‌ ఇయర్‌కు వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం కని పిస్తున్నది. జిల్లాలో సుమారు 4 లక్షల మంది పాన్‌ కార్డులు కలిగి ఉన్నారు. అయితే రిటర్న్స్‌ దాఖలు చేసే వారి సంఖ్య కేవలం 25 శాతంగా ఉంది. 


పన్ను బకాయిదారులకు ‘వివాద్‌సే విశ్వాస్‌’ తో మేలు 

ప్రధాని మోదీ ప్రకటించిన ఊరట కలిగే అంశాల్లో వివాద్‌ సే విశ్వాస్‌ పఽథకం కీలకం కానున్నది. పన్ను ఎగవేతదారులు రాష్ట్ర, కేంద్ర అత్యున్నత న్యాయ స్థానాలకు వెళ్లాల్సిన పని లేకుండానే అధిక శాతం కేసులు కోర్టు వెలుపలే పరి ష్కారమయ్యే అవకాశం ఉంది. ప్రధాని ప్రకటించిన చాప్టర్‌లోని మూడు అంశాల పట్ల పన్ను చెల్లింపుదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం వచ్చే నెల 25 ప్రారంభించనున్నట్టు మోదీ ఇప్పటికే ప్రకటించారు.  

Updated Date - 2020-08-15T11:26:53+05:30 IST