మరో 6 నుంచి 8 వారాల్లోనే థర్డ్‌ వేవ్‌ తథ్యం!

ABN , First Publish Date - 2021-06-20T09:01:11+05:30 IST

రాష్ట్రాలు ఆంక్షల సడలింపు దిశగా అడుగులేస్తున్న వేళ.. వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో దేశంలో థర్డ్‌ వేవ్‌ రావడం తథ్యమని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ గులేరియా చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వ్యాక్సినేషనే అని, అధిక శాతం జనాభాకు వ్యాక్సిన్‌

మరో 6 నుంచి 8 వారాల్లోనే థర్డ్‌ వేవ్‌ తథ్యం!

మరో 6 నుంచి 8 వారాల్లోనే రావచ్చు

ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా హెచ్చరిక


్ఙన్యూఢిల్లీ, జూన్‌ 19: రాష్ట్రాలు ఆంక్షల సడలింపు దిశగా అడుగులేస్తున్న వేళ.. వచ్చే ఆరు నుంచి ఎనిమిది వారాల్లో దేశంలో థర్డ్‌ వేవ్‌ రావడం తథ్యమని ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ గులేరియా చెప్పారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు వ్యాక్సినేషనే అని, అధిక శాతం జనాభాకు వ్యాక్సిన్‌ అందించడం ద్వారానే కరోనాను నియంత్రించగలమని పేర్కొన్నారు. ఇందుకోసం కొవిషీల్డ్‌ డోసుల మధ్య విరామం పెంచడం మంచి ఎత్తుగడేనని, దీని ద్వారా మరింత ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ ద్వారా రక్షణ కల్పించడం సాధ్యమవుతుందని తెలిపారు. ‘‘దేశంలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలైంది. జనం మళ్లీ సమూహాలుగా ఏర్పడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో రద్దీ పెరిగింది. కొవిడ్‌ మార్గదర్శకాలను పట్టించుకోవడం లేదు. ఈ ప్రభావంతో కేసులు పెరగడానికి కొంత సమయం పడుతుంది.


పరిస్థితులు చూస్తుంటే.. థర్డ్‌ వేవ్‌ అనివార్యం అనిపిస్తోంది. ఇది ఆరు నుంచి ఎనిమిది వారాల్లోనే రావచ్చు. లేదా మరికొంత ఆలస్యం కావచ్చు. అంతేగానీ.. రావడం మాత్రం తథ్యం. ఇదంతా.. జనసమూహాలను నియంత్రించడంలో, కొవిడ్‌ మార్గదర్శకాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుంది’’ అని గులేరియా వివరించారు. సాధారణంగా న్యూవేవ్‌ రావడానికి కనీసం మూడు నెలల సమయం పడుతుందని, కానీ, ఇంత తక్కువ సమయంలోనే రావడం ఆందోళనకరమేనని చెప్పారు. దేశంలో విస్తరించిన డెల్టా వేరియంట్‌.. ఇప్పుడు డెల్టా ప్లస్‌ వేరియంట్‌గా పరివర్తన చెందిందని, దీనిపై మరింత అధ్యయనం జరగాలన్నారు. తొలి రెండు వేవ్‌ల నుంచి గుణపాఠం నేర్చుకుని.. తగిన చర్యలు తీసుకోవాలని, పాజిటివిటీ రేటు 5ు మించిన ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్‌లు విధించాలని సూచించారు. 



Updated Date - 2021-06-20T09:01:11+05:30 IST