పాఠశాలల్లో వసతుల కల్పనే ధ్యేయం : ఎమ్మెల్యే రవీంద్ర

ABN , First Publish Date - 2022-05-25T06:32:03+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనే మన ఊరు, మనబడి ధ్యేయమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మన ఊరు, మనబడి కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలం లోని పడ్మట్‌పల్లి, ముదిగొండ కర్నాటిపల్లి పాఠశాలల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం ప్రారంభించారు.

పాఠశాలల్లో వసతుల కల్పనే ధ్యేయం : ఎమ్మెల్యే రవీంద్ర
పాఠశాలలో అదనపు గదులు ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

దేవరకొండ/చింతపల్లి, మే 24: ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనే మన ఊరు, మనబడి ధ్యేయమని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. మన ఊరు, మనబడి కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలం లోని పడ్మట్‌పల్లి, ముదిగొండ కర్నాటిపల్లి పాఠశాలల్లో నిర్మించిన అదనపు తరగతి గదులను మంగళవారం ప్రారంభించారు. విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మ కృష్ణయ్య, ఎంపీపీ జాన్‌యాదవ్‌, జడ్పీటీసీ మారేపాకల అరుణ సురేష్‌గౌడ్‌, పల్లా ప్రవీన్‌రెడ్డి, చింతపల్లి సుభాష్‌, టీవీఎ న్‌రెడ్డి, ఎంపీడీవో శర్మ, దస్రునాయక్‌ పాల్గొన్నారు. చింతపల్లి మండలంలోని మధనాపురం గ్రామానికి లబ్ధిదారుడికి సీఎం సహాయనిధి చెక్కు, మధనాపురం లబ్ధిదారురాలికి మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను  ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు టవీఎన్‌రెడ్డి, పల్లా ప్రవీన్‌రెడ్డి, ముత్యాల సర్వయ్య, ఉడుతల అక్రమ్‌యాదవ్‌, బొడ్డుపల్లి కృష్ణ పాల్గొన్నారు. మండలంలోని కుర్మేడు గ్రామంలో మృతిచెందిన టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకురాలు కుంభం రాములమ్మ మృతదేహంపై ఎమ్మెల్యే పూలమాలలు  వేసి నివాళులర్పించారు. 

Updated Date - 2022-05-25T06:32:03+05:30 IST