Rajya Sabha ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవీకే కూటమి అభ్యర్థికి మజ్లిస్ ఓటు

ABN , First Publish Date - 2022-06-10T13:35:36+05:30 IST

మహారాష్ట్రలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ కూటమికి మద్దతు ఇవ్వాలని ఏఐఎంఐఎం(మజ్లిస్) పార్టీ నిర్ణయించింది...

Rajya Sabha ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని ఎంవీకే కూటమి అభ్యర్థికి మజ్లిస్ ఓటు

ముంబై(మహారాష్ట్ర): మహారాష్ట్రలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాదీ కూటమికి మద్దతు ఇవ్వాలని ఏఐఎంఐఎం(మజ్లిస్) పార్టీ నిర్ణయించింది.మజ్లిస్ పార్టీకి చెందిన ఇద్దరు మహారాష్ట్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి ఓటు వేయనున్నారు. ఔరంగాబాద్‌కు చెందిన ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు ఈ మేర ట్వీట్ చేశారు.‘‘బీజేపీని ఓడించేందుకు మహారాష్ట్రలోని రాజ్యసభ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి ఓటు వేయాలని మా పార్టీ (ఏఐఎంఐఎం) నిర్ణయించింది. అయితే మా రాజకీయ సైద్ధాంతిక విభేదాలు భాగస్వామి అయిన శివసేనతో కొనసాగుతాయి. కాంగ్రెస్,ఎన్‌సీపీలు ఈ ఎంవిఏ కూటమిలో ఉన్నాయి’’ అని జలీల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.


’’రాజ్యసభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి ఓటు వేయాలని మా ఇద్దరు మజ్లిస్ పార్టీ మహారాష్ట్ర ఎమ్మెల్యేలను కోరాను. ఇమ్రాన్ కు మా శుభాకాంక్షలు’’అని పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీని ఉటంకిస్తూ ట్వీట్‌లో పేర్కొన్నారు.ధూలే, మాలేగావ్‌లోని తమ మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి కొన్ని షరతులు పెట్టిందని ఎంపీ జలీల్ చెప్పారు.మహారాష్ట్ర పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (ఎంపీఎస్సీ)లో మైనారిటీ సభ్యుడిని నియమించాలని, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఏఐఎంఐఎం డిమాండ్ చేసింది.


Updated Date - 2022-06-10T13:35:36+05:30 IST