సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-08-12T06:18:13+05:30 IST

సైబర్‌నేరాలపై అవగాహన కల్పించడమే సైబర్‌ అంబాసిడర్‌ రఽపధాన లక్ష్యమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం
విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, ఆగస్టు 11: సైబర్‌నేరాలపై అవగాహన కల్పించడమే సైబర్‌ అంబాసిడర్‌ రఽపధాన లక్ష్యమని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. ఉమెన్‌  సేష్టీ వింగ్‌ తెలంగాణ పోలీస్‌, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌, యం గిస్తాన్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై జిల్లాలోని విద్యార్థులకు 10 నెలల పాటు ఆన్‌లైన్‌లో శిక్షణ  ఇచ్చిన సందర్భంగా సినారె కళామందిరంలో గురువారం సైబర్‌ కాంగ్రెస్‌ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమం నిర్వహించారు.  కలెక్టర్‌ ఆనురాగ్‌ జయంతి,   ఎస్పీ రాహుల్‌హెగ్డే హాజర య్యా రు. కలెక్టర్‌ మాట్లాడుతూ శిక్షణ తీసుకున్న విద్యార్థులు తన తోటి విద్యార్థుల తోపాటు సామాన్య ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగా హన కల్పించాలని చెప్పారు. ఎస్పీ రాహుల్‌హెగ్డే మాట్లాడుతూ విద్యా వ్యవస్థ లో ఆన్‌లైన్‌ భద్రతపై అవగాహన కల్పించాలని పోలీసుశాఖ భావిస్తోందని అన్నారు.  సైబర్‌ అంబా సిడర్‌లకు బహుమతులు ప్రదానం చేశారు.  అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఈవో రాధాకిషన్‌, డీఎస్పీలు చంద్రకాంత్‌, నాగేంద్రచారీ, సీఐ అనిల్‌కుమార్‌, షీటీం ఎస్‌ఐ నవత, కోఆర్డినేటర్‌ పద్మజ, యంగిస్తాన్‌ ప్రతినిధి పురుషోత్తం పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T06:18:13+05:30 IST