న్యూఢిల్లీ: బూస్టర్ డోసులు అవసరమేనని ఢిల్లీ ఎయిమ్స్ కోవిడ్ టాస్క్ఫోర్స్ చైర్పర్సన్ డాక్టర్ నవ్నీత్ చెబుతున్నారు. బూస్టర్ డోసుల ఆవశ్యకతపై తక్షణమే అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. వయసుల వారీగా వేర్వేరు రోగులపై ఈ అధ్యయనాలు కొనసాగాలని సూచించారు. ఇజ్రాయిల్లో బూస్టర్ డోస్ ప్రభావశీలత 40 నుంచి 93 శాతానికి పెరిగిందని డాక్టర్ నవ్నీత్ చెప్పారు.