Bhubaneswar ఎయిమ్స్‌లో 250 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...ఓపీడీ సేవలు నిలిపివేత

ABN , First Publish Date - 2022-01-17T12:47:32+05:30 IST

ఒడిశా రాష్ట్రంలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 250మంది వైద్యులు, వైద్య విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు...

Bhubaneswar ఎయిమ్స్‌లో 250 మంది వైద్యులు, సిబ్బందికి కరోనా...ఓపీడీ సేవలు నిలిపివేత

భువనేశ్వర్ : ఒడిశా రాష్ట్రంలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో 250మంది వైద్యులు, వైద్య విద్యార్థులు, పారామెడికల్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతో భువనేశ్వర్ ఎయిమ్స్ లో ఔట్ పేషెంట్ డిపార్టుమెంట్ (ఓపీడీ) సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎయిమ్స్ లో 250 మంది వైద్యులు, సిబ్బందికి కొవిడ్ సోకడంతో ఆసుపత్రిని సజావుగా నడిపించేందుకు తాము ఓపీడీ సేవలను నిలిపివేయాల్సి వచ్చిందని మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సచ్చిదానంద మొహంతి చెప్పారు.అత్యవసర కేసులకు తాము ఇన్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెప్పారు.ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రోగులు తమ ఆన్‌లైన్ బుకింగ్ నంబర్‌ను ఎంట్రీ గేట్ వద్ద చూపించడం ద్వారా వారు చికిత్స పొందవచ్చని వైద్యులు చెప్పారు. భువనేశ్వర్ ఎయిమ్స్ లో స్వస్త్య యాప్, టెలీమెడిసిన్ వాట్సాప్ కాల్ సేవలు యథాతధంగా కొనసాగుతాయని వైద్యులు చెప్పారు. 

Updated Date - 2022-01-17T12:47:32+05:30 IST