Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎయిడ్స్‌ను తరిమికొట్టాలి

  1. ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌


నంద్యాల(నూనెపల్లె), డిసెంబరు 1: ఎయిడ్స్‌ మహమ్మారిని తరిమి కొట్టాలని నంద్యాల ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విజయ్‌ కుమార్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా జిల్లా ఆస్పత్రి ఏఆర్‌టీసీ సెంటర్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. సూపరింటెండెంట్‌ జెండాఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎయిడ్స్‌ను అరికట్టడంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆస్పత్రి నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ శేషరత్నం, డాక్టర్‌ అనూరాధ, డాక్టర్‌ సుధాకర్‌, డాక్టర్‌ జఫ్రూల్లా, ఏఆర్‌టీ సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. 


ఆళ్లగడ్డ: ప్రజల్లో ఎయిడ్స్‌పై అవగాహన ఉండాలని వైద్యులు ఉమాదేవి, ఆంజనేయులు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం పట్టణంలోని చైతన్య రూరల్‌ డెవల్‌పమెంట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యశాల నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో చైతన్య రూరల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు మేనేజరు చంద్రమౌళి, పవన్‌కుమార్‌రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.


గోస్పాడు: ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా బుధవారం గోస్పాడులోని జూనియర్‌ కళాశాలలో విద్యార్థులకు పీహెచ్‌సీ డాక్టర్‌ గోపాల్‌, వైద్య సిబ్బంది ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధి అంటురోగం కాదన్నారు. 


చాగలమర్రి: చాగలమర్రిలో ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా బుధవారం వైద్యుడు నారాయణరెడ్డి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీహెచ్‌వో రెడ్డెమ్మ, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటమ్మ, సూపర్‌వైజర్లు సీతారాములు, ప్రమీలమ్మ, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు. 


పాణ్యం: ఎయిడ్స్‌ నివారణకు అవగాహనే మందు అని  డాక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. ప్రపంచ  ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా శాంతిరాం ఫార్మసీ కళాశాలలో ఎన్‌ఎన్‌ఎ్‌స విభాగం ఆధ్వర్యంలో బుధవారం ఎయిడ్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్‌ బారిన 15 నుంచి 48 ఏళ్లలోపువారే పడుతున్నారన్నారు. గ్రామాల్లో ఎయిడ్స్‌ వ్యాప్తి గురించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.Advertisement
Advertisement