అన్నాడీఎంకేలో విభేధాలు.. రహస్య మంతనాలు..!

ABN , First Publish Date - 2020-09-30T14:46:05+05:30 IST

వచ్చే ఎన్నికల్లో కాబోయే సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై అధికార అన్నాడీఎంకేలో విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మంగళ వారం ఉదయం ఆ పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి

అన్నాడీఎంకేలో విభేధాలు.. రహస్య మంతనాలు..!

చెన్నై: వచ్చే ఎన్నికల్లో కాబోయే సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై అధికార అన్నాడీఎంకేలో విభేదాలు ఇంకా కొనసాగుతున్నాయి. మంగళ వారం ఉదయం ఆ పార్టీ సమన్వయకర్త, ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం నివాసం లో పార్టీ డిప్యూటీ సమన్వయ కర్తలు, తన మద్దతు దారులతో పన్నీర్‌సెల్వం చర్చలు జరిపారు. సోమవారం జరిగిన పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో పన్నీర్‌ సెల్వం, ముఖ్యమంత్రి ఎడప్పాడి మధ్య ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై వాగ్వాదం జరిగింది. సీఎం అభ్యర్ధిగా తననే ప్రకటించాలని పన్నీర్‌సెల్వం పట్టుబట్టారు. దీంతో సమావేశంలో పాల్గొన్న సీనియర్‌ మంత్రులు, పార్టీ ప్రముఖులు అతనిని శాంతింపజేశారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై అక్టోబర్‌ ఏడున ఎడప్పాడి, పన్నీర్‌సెల్వం సంయుక్తంగా ప్రకటిస్తారని డిప్యూటీ సమన్వయకర్త కేపీ మునుసామి ప్రకటించారు. ఆ ప్రకటనతో పార్టీలో విబేఽ దాలు సద్దుమణ గుతాయని అందరూ భావిం చిన నేపథ్యంలో మంగళ వారం ఉదయం పన్నీర్‌ సెల్వం నివాసంలో పార్టీ  ఉప సమన్వయకర్తలు, తన మద్దతు దారులతో పన్నీర్‌ సెల్వం రహస్యంగా చర్చలు జరుపటం కలకలం సృష్టించింది.


ఆ సందర్భంగా పన్నీర్‌సెల్వం నివాసం ఎదుట పార్టీ కార్య కర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడటంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళి వారిని అదుపుచేశారు. పన్నీర్‌సెల్వంతో పార్టీ ఉప సమన్వయ కర్తలు కేపీ మును సామి, వైద్య లింగం, మాజీ ఎంపీ మనోజ్‌ పాండ్యన్‌ తదితరులు చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయం పైనే గాకుండా పార్టీలో 11 మందితో మార్గదర్శక కమిటీ ఏర్పాటు చేసే అంశంపై కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. ఈ సమావేశం ముగిసిన తర్వాత డిప్యూటీ సమన్వయకర్త వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి విబేధాలు లేవని, పార్టీలో సమైక్యతను పెంచే దిశగానే ఉపముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో చర్చలు జరిపామని తెలిపారు. ఇదిలా ఉండగా లాక్‌డౌన్‌ సడలింపులపై జిల్లా కలెక్టర్లతో జరిగే సమావేశంలో పన్నీర్‌ సెల్వం తప్ప కుండా పాల్గొనేవారు. అయితే మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి ఎడప్పాడి అధ్యక్షతన సచివాలయం నుంచి జరిగిన వీడియా కాన్ఫరెన్స్‌కు పన్నీర్‌సెల్వం హాజరుకాలేదు. మంగళవారం మధ్యాహ్నం ఆయన తన స్వంత జిల్లా తేనికి బయల్దేరివెళ్ళారు.

Updated Date - 2020-09-30T14:46:05+05:30 IST