దారుణ మారణహోమాన్ని ఆపే దారేది?

ABN , First Publish Date - 2021-09-17T00:58:11+05:30 IST

దారుణ మారణహోమాన్ని ఆపే దారేది?

దారుణ మారణహోమాన్ని ఆపే దారేది?

హైదరాబాద్: ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కామాంధుడు రాజు వరంగల్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు. రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రాజారాం వంతెన రేల్వే ట్రాక్‌పై రాజు మృతదేహం లభ్యమైంది. మృతుడి చేతిపై మౌనిక అనే పేరుతో ఉన్న టాటూ ఆధారంగా హత్యాచార నిందితుడు రాజుగా గుర్తించారు. రాజు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. 


కాగా ఈ నెల 9న రాజు మాదన్నపేటలో  భవన నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. పొద్దున 9 గంటలకు వెళ్లి.. సాయంత్రం 4 గంటలకు తన గదికి తిరిగొచ్చాడు. సాయంత్రం 4.30-5 గంటల మధ్యలో చిన్నారికి మాయ మాటలు చెప్పి తన రూమ్‌కు తీసుకొచ్చి లైంగికదాడి జరిపాడు. ఆమె అరుస్తుంటే గొంతు నులిమి చంపేశాడు. తర్వాత గదికి తాళం వేసి బయటకు వచ్చిన రాజు.. తాగిన మైకంలో అదే ప్రాంతంలో తచ్చాడాడు. సాయంత్రం 7గంటలకు స్థానికంగా ఉన్న పానీపూరి బండి వద్ద పానీ పూరి తిన్నాడు. అప్పటికే సింగరేణి కాలనీ వాసులందరూ పాప కోసం వెతికారు.


రాత్రి 9 గంటలకు చిన్నారి నాయనమ్మను చూసిన రాజు.. ‘‘పాప కనిపించిందా?’’ అని ప్రశ్నించాడు. తాగిన మత్తులో రోడ్డుపై వెళ్తున్న అతను అలా ప్రశ్నించడంతో పాప నాయనమ్మకు అనుమానం వచ్చి ఇంట్లోవాళ్లకు చెప్పింది. దీంతో వారు.. పాప చెవికి ఉన్న బంగారు దుద్దుల కోసం అతడు తమ కుమార్తెను తీసుకోపోయి ఉండొచ్చని అనుమానించిన కుటుంబసభ్యులు ఆ విషయాన్ని స్థానికులకు చెప్పారు. విషయం తెలిసిన రాజు మెల్లిగా అక్కడి నుంచి తప్పించుకున్నాడు. 


స్థానికుల సాయంతో కుటుంబసభ్యులు రాజు ఉంటున్న గది వద్దకు వెళ్లగా.. గదికి తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికులు గది తాళం పగలగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు వద్దన్నారు. రాత్రి 12 గంటల దాకా వెతికి ఆ తర్వాత గది తాళం పగలగొట్టడంతో పాప మృతదేహం కనిపించింది. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. నిందితుడు రాజును ఎన్‌కౌంటర్ చేయాలనే డిమాండ్ వినిపించింది. రాజును పట్టిస్తే రూ.10 లక్షలు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. తాజాగా నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నారు. 


ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘‘ఒక రాక్షసుడు చచ్చాడు. వందలమంది మనమధ్యే ఉన్నారు. చట్టాల ఆపలేక పోతున్నాయి. ఎన్‌కౌంటర్లు భయపెట్టపోతున్నాయి. దారుణ మారణహోమాన్ని ఆపే దారేది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 


Updated Date - 2021-09-17T00:58:11+05:30 IST