హైదరాబాద్: బీజేపీ(BJP) కుటిల రాజకీయాలు చేస్తోందని ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్(Sampath kumar) మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిందన్నారు. సీబీఐ, ఈడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలుగా విఫలమయ్యాయని విమర్శించారు. సమస్యలు పక్కదారి పట్టించేందుకే టీఆర్ఎస్ - బీజేపీ ఫ్లెక్సీల పంచాయితీ అని అన్నారు. సీఎం కేసీఆర్(KCR) అవినీతిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో కార్యాచరణ ప్రకటించాలని సంపత్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి