అహుడా నిబంధనలు సడలించాలి

ABN , First Publish Date - 2021-10-19T05:59:28+05:30 IST

సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్న అహుడా నిబంధనలు సడలించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ డిమాండ్‌ చేశారు.

అహుడా నిబంధనలు సడలించాలి
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న సీపీఐ నాయకులు

అనంతపురం క్లాక్‌టవర్‌, అక్టోబరు 18: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు పెనుభారంగా మారుతున్న అహుడా నిబంధనలు సడలించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సీపీఐ ఆఽధ్వర్యంలో కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మిని కలిసి, ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగదీష్‌ మాట్లాడుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజలు సొంతిల్లు నిర్మించుకునేందుకు వీలుకాని విధంగా అహుడా నిబంధనలు ఉన్నాయన్నారు. 40 నుంచి 50 అడుగుల రోడ్లు ఉంటేనే అహుడా పరిధిలో ఇళ్ల రిజిస్ట్రేషన చేస్తామనీ, లేకుంటే తిరస్కరిస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు సొంత స్థలం అమ్ముకోవాలన్నా, కొనాలన్నా ప్రభుత్వ వేధింపులు అధికమయ్యాయన్నారు. సొంతిల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వానికి కప్పం కట్టే విధంగా నిఽబంధనల పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం చేపడుతున్న జగనన్న పేదలందరికీ ఇళ్లు పథకానికి ఎక్కడా అహుడా నిబంధనలు పాటించడం లేదనీ, ప్ర భుత్వమే ఉల్లంఘిస్తూ.. ప్రజలపై మాత్రం రుద్దడం తగదన్నారు. అర్బన ప్రాంతాలను మా త్రమే అహుడాలో ఉంచి, మిగిలిన గ్రామాలను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. 2016లో అహుడా ఏ ర్పాటు చేశారనీ, అంతకు ముందు కొన్న ప్లాట్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే పే దల తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్‌, నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి అల్లీపీరా, రా మాంజనేయులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-19T05:59:28+05:30 IST