Abn logo
May 9 2021 @ 00:03AM

ఉత్సవమూర్తులకు రెండో రోజు వసంతోత్సవం

ఆళ్లగడ్డ, మే 8: అహోబిలం శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవమూర్తులకు వేదపండితులు శనివారం రెండో రోజు వసంతోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆకాంక్షతో  ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు చేసినట్లు ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్‌ తెలిపారు. 

Advertisement