CBI RAIDS : బీహార్‌లో బలపరీక్షకు ముందే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు

ABN , First Publish Date - 2022-08-24T15:35:24+05:30 IST

బీహార్(Bihar) రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి నితీష్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షకు(floor test) ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్...

CBI RAIDS : బీహార్‌లో బలపరీక్షకు ముందే ఆర్జేడీ నేతల నివాసాలపై సీబీఐ దాడులు

పాట్నా(బీహార్): బీహార్(Bihar) రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్‌తో కలిసి నితీష్ కుమార్ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వం బలపరీక్షకు(floor test) ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)(CBI raids) బుధవారం ఆర్జేడీ నాయకుల(RJD leaders) ఇళ్లపై దాడులు చేసింది. భూములకు ఉద్యోగాల కుంభకోణంలో విచారణ జరిపేందుకు సీబీఐ బలపరీక్షకు ముందే దాడులు చేయడం బీహార్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. లాలూప్రసాద్ యాదవ్ రైల్వేశాఖ మంత్రిగా ఉన్నపుడు వ్యవసాయ భూములను లంచంగా తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన కుంభకోణంలో భాగంగా బుధవారం సీబీఐ అధికారులు ఆర్జేడీ నాయకులు అష్ఫాఖ్ కరీం, సునీల్ సింగ్ ల(RJD MLC Sunil Singh) ఇళ్లపై దాడులు చేశారు. 


బీజేపీ(bjp)చేయించిన సీబీఐ దాడులతో ఆర్జేడీ ఎమ్మెల్యేలు భయపడి నితీష్ సర్కారుకు వ్యతిరేకంగా ఓటు చేస్తారని ఇలా చేస్తున్నారని ఆర్జేడీ(rjd) నాయకుడు సునీల్ సింగ్ ఆరోపించారు.సీబీఐ లేదా ఈడీ, ఐటీ దాడులను బీజేపీని చేయిస్తుందని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా విమర్శించారు.బీజేపీ పార్టీ కింద ఈడీ,సీబీఐ, ఐటీ శాఖలు పనిచేస్తూ బీజేపీ స్రిప్టు ప్రకారం దాడులు కొనసాగిస్తుందని మనోజ్ ఆరోపించారు.


Updated Date - 2022-08-24T15:35:24+05:30 IST