Abn logo
Jul 4 2020 @ 17:59PM

ఒక్క షోకు రూ.8 లక్షలు కావాలట

తమన్నా హీరోయిన్‌గా కనిపించిన చిత్రం ‘సైరా’. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో స్పెషల్‌సాంగ్ చేసింది. ఇప్పుడు ‘సీటిమార్‌’లో నటిస్తోంది. తమన్నకు ఇంకా మంచి క్రేజ్ ఉంది. ఫీల్డ్‌లోకి వచ్చి ఒకటిన్నర దశాబ్ధం గడిచినా వన్నె తగ్గలేదు. వెన్నెల బొమ్మలాంటి మిల్కీ అంటే ఇప్పటికీ కుర్రాళ్లకు ఆనందమే. కాకపోతే కొత్త బ్యూటీస్ వరుస పెట్టి వచ్చేస్తున్నప్పుడు సీనియర్ సుందరీమణులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా?. అందుకే ‘‘ఆహా’’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ఈ భామ ల్యాండ్ అవ్వాలనుకుంటుందట. ఓ టాక్ షో కోసం తమన్న రెడీ అవుతోందట. 


అల్లు అరవింద్ ‘‘ఆహా’’ కోసం తమన్న టాక్ షో వార్త గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తూనే ఉంది. కానీ ఇంకా అధికారికంగా ప్రకటన అయితే రాలేదు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రచారం మొదలైంది. తమ్ము.. ఒక ఎపిసోడ్‌కు  రూ. 8 లక్షల దాకా రెమ్యూనరేషన్ తీసుకోనుందట. ఓటీటీ మార్కెట్‌లో ఇది నిజంగా పెద్ద అమౌంటే. మొత్తంగా టాక్ షో ఎపిసోడ్స్ పూర్తయ్యే నాటికి తమన్నా ఖాతాలో సినిమా చేసినంత రెమ్యూనరేషన్ జమ అవుతోంది. మరి మిల్కీ మాటలపై నమ్మకంతో లక్షలు ఖర్చు చేస్తోన్న ‘ఆహా’కు తమన్నా షో ఎలాంటి లాభం చేకూర్చుతుందో చూడాలి. 


Advertisement
Advertisement
Advertisement