‘ఆహా’లో ‘మంచి రోజులు వ‌చ్చాయి’.. ప్రీమియ‌ర్‌ ఎప్పుడంటే?

100 పర్సెంట్ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో సంతోశ్ శోభ‌న్‌, మెహ‌రీన్ జంట‌గా.. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హిట్ ‘మంచి రోజులు వ‌చ్చాయి’ చిత్రం ప్రీమియర్ కాబోతోంది. రీసెంట్‌గా థియేటర్లలో విడుద‌లై మంచి విజయం అందుకున్న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌లు కూడా అందుకుంది. రొమాంటిక్‌, కామెడీ, ఎమోష‌న్స్.. ఇలా అన్నీ ఎలిమెంట్స్ క‌ల‌గ‌లిసి ఉన్న ఈ చిత్రం డిసెంబర్ 3న ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది.


ఈ చిత్ర కథ విషయానికి వస్తే..

పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులైన సంతోశ్‌, ప‌ద్మ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాల‌నుకుంటారు. అదే స‌మ‌యంలో ఇండియాలో పాండమిక్ ప్రారంభం అవుతుంది. ఆ కార‌ణంగా వారిద్ద‌రూ స్వ‌స్థ‌లం హైద‌రాబాద్ చేరుకుంటారు. ప‌ద్మ తండ్రి గోపాలంకు త‌న కూతురంటే అమిత‌మైన ప్రేమ. త‌న కూతురు మరో అబ్బాయితో ప్రేమ‌లో ఉంద‌నే విష‌యం గోపాలంకు తెలుస్తుంది. తన ప్రేమను ఆయ‌న వ్య‌తిరేకిస్తాడు. సాధార‌ణంగా గోపాలం భ‌య‌స్థుడు. దాన్ని అలుసుగా తీసుకుని చుట్టూ ఉన్నవారు ఆయ‌నని భ‌య‌పెడుతుంటారు. ఆ కార‌ణంగా ఆయ‌న‌లో భ‌యం ఇంకా పెరుగుతుందే కానీ, త‌గ్గ‌దు. అలాంటి భ‌యంతో కూతురి ప్రేమ‌ను ఆయ‌న ఒప్పుకోడు. సంతోశ్ కంటే మంచి సంబంధం తీసుకొచ్చి కూతురికి పెళ్లి చేయాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలో గోపాలం త‌నలోని భ‌యాల‌ను ఎలా అధిగ‌మిస్తాడు. గోపాలం ఫ్యామిలీకి సంతోశ్ ఎలా స‌పోర్ట్‌గా నిలుస్తాడు? సంతోశ్‌, ప‌ద్మ ప్రేమ‌ను గోపాలం అర్థం చేసుకుంటాడా? వంటి వాటికి సమాధానమే ‘మంచి రోజులు వ‌చ్చాయి’ సినిమా.

Advertisement
Advertisement