Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 13 Jan 2022 11:42:12 IST

ఇకపై తమిళంలోనూ ‘ఆహా’

twitter-iconwatsapp-iconfb-icon
ఇకపై తమిళంలోనూ ఆహా

అల్లు అరవింద్ సొంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’.. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది. ప్రారంభంలో కేవలం తెలుగు వారికి మాత్రమే ప్రత్యేక ఓటీటీగా అందుబాటులోకి వచ్చింది ‘ఆహా’. తెలుగు వెబ్ సిరీస్, తెలుగు సినిమాలు, టాక్ షోస్ తో పాటు మలయాళ చిత్రాల డబ్బింగ్ వెర్షన్స్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ‘నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్’ తరహాలో అన్ని భాషల కంటెంట్స్‌తోనూ నింపేయకుండా..  కేవలం తెలుగు కంటెంట్ తోనే సబ్ స్ర్కైబర్స్ ను క్రమేపీ పెంచుకుంటూ వెళ్ళింది. ఈ నేపథ్యంలో ‘ఆహా’ను ఇతర భాషల్లోనూ విస్తరించడానికి నిర్వాహకులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు తొలి అడుగు పడింది. ‘ఆహా’ తమిళ ప్లాట్ ఫామ్ ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అంతేకాదు ‘ఆహా’ లో మొదటి తమిళ స్ట్రీమింగ్ ప్రాజెక్ట్ కూ ముహూర్తం కుదిరింది.


ఈ నెల 28న ‘ఆహా’ తమిళం అందుబాటులోకి రాబోతోంది. అందులో భాగంగా మొదటి కంటెంట్ గా శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన ‘ఇరై’ వెబ్ సిరీస్ స్ట్రీమ్ కానుంది.  అంతేకాదు తమిళం నుంచి భారీ ఎత్తున కంటెంట్ ను ఆహా టీమ్ కొనుగోలు చేయబోతోంది.  తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ తో పాటు టాక్ షోస్ కూడా ఇందులో ఉండబోతున్నాయి. ‘ఆహా’ తెలుగుకు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తరహాలోనూ ఆహా తమిళానికి కూడా ఓ తమిళ స్టార్ హీరో అన్వేషణలో ఉందట టీమ్. మరి తెలుగులో లాగానే తమిళంలోనూ ‘ఆహా’.. ఆహా అనిపిస్తుందేమో చూడాలి. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement