దాళ్వాకు సాగు నీరందించాలి

ABN , First Publish Date - 2022-01-22T05:54:27+05:30 IST

దాళ్వాకు సాగునీరందించాలని సీపీ ఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్‌ అన్నారు. గుమ్మలూరులో శుక్రవారం సీపీ ఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.

దాళ్వాకు సాగు నీరందించాలి

 గుమ్మలూరులో సీపీఎం నాయకుల ధర్నా 

పోడూరు/భీమవరం అర్బన్‌, జనవరి 21:దాళ్వాకు సాగునీరందించాలని సీపీ ఎం మండల కార్యదర్శి పిల్లి ప్రసాద్‌ అన్నారు. గుమ్మలూరులో శుక్రవారం సీపీ ఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ నక్కల కాల్వను ఆనుకుని సుమారు వంద ఎకరాలకు నీరు అందక రైతులు ఆందదోళన చెందుతున్నారన్నారు. నారుమడులు వేసి నెల గడిచినా ఇప్పటి వరకు నీరు సక్రమంగా అందకపోవడంతో చేలు నెరలు తీశాయన్నారు. దొంగరా విపాలెం వద్ద ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆకుమర్తి  శివ ప్రసాద్‌, కండవల్లి విగ్నేశ్వరరావు పాల్గొన్నారు. 

సాగుకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి..

 దాళ్వా సాగుకు నీటి ఎద్దడి లేకుండా చూడాలని సీపీఎం డెల్టా జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్‌ చేశారు. దాళ్వా నాట్లు ప్రారంభమై నెలలు గడుస్తున్నా నేటికీ దాదాపు 50 శాతం మాత్రమే పూర్తయ్యాయన్నారు. సాగునీటి ఎద్దడి చాలా ప్రాంతాల్లో కనిపిస్తుందన్నారు. పలు మండలాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఇప్పటికీ దుక్కులు పూర్తి కాలేదన్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి సాగుకు అవసరమైన నీటిని అందించాలన్నారు. 

Updated Date - 2022-01-22T05:54:27+05:30 IST