వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-07-08T11:13:46+05:30 IST

వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ రైతులు పండించిన పంటలకు మార్కెట్‌ సౌకర్యం కల్పించేలా బాటలు వేయాలని కలెక్టర్‌ పోలా

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలి: కలెక్టర్‌

ఒంగోలు(రూరల్‌), జూలై 7: వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తూ రైతులు పండించిన పంటలకు మార్కెట్‌ సౌకర్యం కల్పించేలా బాటలు వేయాలని కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సూచించారు. మంగళవారం ఒంగోలులోని ఏఎంసీ కార్యాలయంలో వ్యవసాయ, ఉద్యానవన శాఖ, మార్కెటింగ్‌ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు.


ఈ-క్రాపింగ్‌ విధానం పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. రైతు ఉత్పత్తి సంఘాల్లో రైతులను చేర్చాలని ఆదేశించారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జేసీ వెంకటమురళీ, జేడీఏ శ్రీరామమూర్తి, డీఆర్‌డీఏ పీడీ ఎలీషా, పలు శాఖల అధికారులు బి.రవీంద్రబాబు, యు.నాగరాజు, ఎన్‌.మల్లారెడ్డి, వి.వెంకటరమణ, ఉపేంద్రకుమార్‌, కె.ఈశ్వర్‌రావు, పి.సరిత, ఎం.శ్రీలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2020-07-08T11:13:46+05:30 IST