వ్యవసాయంపై యువత ఆసక్తి కనబర్చాలి: గవర్నర్‌

ABN , First Publish Date - 2022-04-14T02:31:28+05:30 IST

వ్యవసాయం వైపు యువత అడుగులు వేయాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని

వ్యవసాయంపై యువత ఆసక్తి కనబర్చాలి: గవర్నర్‌

అమరావతి: వ్యవసాయం వైపు యువత అడుగులు వేయాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలోని వణుకూరులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాన్ని (ఆర్బీకే) బుధవారం ఆయన సందర్శించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు, కౌలు రైతులు అందుతున్న సేవలపై సంబంధిత శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులతో మాట్లాడారు. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా సుమారు 20 వేల మంది నిరుద్యోగలకు ఉపాధి కల్పించినట్టు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విత్తనం నుంచి విక్రయం వరకు ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా జరగడం హర్షణీయమని విశ్వభూషణ్‌ చెప్పారు. 

Updated Date - 2022-04-14T02:31:28+05:30 IST