వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2021-01-27T06:39:35+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండుచేస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో కోనసీమ రైతుసంఘాల కోఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి

అమలాపురం టౌన్‌, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణం రద్దు చేయాలని డిమాండుచేస్తూ ఢిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళనకు సంఘీభావం తెలుపుతూ మంగళవారం అమలాపురం గడియార స్తంభం సెంటర్‌లో కోనసీమ రైతుసంఘాల కోఆర్డినేషన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కేంద్రం రైతుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని నినాదాలు చేశారు.  కోఆర్డినేషన్‌ కమిటీ నాయకులు కొప్పుల సత్తిబాబు, కారెం వెంకటేశ్వరరావు, అయితాబత్తుల సుభాషిణి, పచ్చిమాల వసంతకుమార్‌, టి.నాగవరలక్ష్మి, నిమ్మకాయల శ్రీనివాస్‌, అడపా సత్యనారాయణ, కల్వకొలను తాతాజీ, వంటెద్దు బాబి, పఠాన్‌ ఇబ్రహీంఖాన్‌, మోకా శ్రీను, అయితాబత్తుల శ్రీను, కుడుపూడి రాఘవమ్మ, జి.దైవకృప  పాల్గొన్నారు.  


Updated Date - 2021-01-27T06:39:35+05:30 IST