కొత్త వ్యవసాయ చట్టాలతో ‘కార్పొరేట్‌’కు ప్రయోజనం

ABN , First Publish Date - 2021-01-27T05:25:35+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్‌ సంస్థ లకే ప్రయోజనం చేకూరుతుందని రైతు సంఘం పశ్చి మ ప్రకాశం ప్రధాన కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.

కొత్త వ్యవసాయ చట్టాలతో ‘కార్పొరేట్‌’కు ప్రయోజనం
గిద్దలూరులో ర్యాలీ నిర్వహిస్తున్న రైతులు

  రైతులకు తీవ్ర నష్టం

 రద్దు చేయాలని  రైతు సంఘం నేత డిమాండ్‌

 పలుచోట్ల ట్రాక్టర్ల ర్యాలీ

గిద్దలూరు, జనవరి 26: కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో కార్పొరేట్‌ సంస్థ లకే ప్రయోజనం చేకూరుతుందని రైతు సంఘం పశ్చి మ ప్రకాశం ప్రధాన కార్యదర్శి గాలి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్మీక్యాంటీన్‌ నుంచి గాంధీబొమ్మ సెంటర్‌ వరకు ట్రాక్టర్‌ ర్యాలీ, మోటార్‌ సైకిల్‌ ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా  వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ గత రెండునెలలుగా ఢిల్లీలో, దేశవ్యాప్తంగా రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఈ చట్టాలతో దేశంలో వ్యవసాయం కనుమరుగై కార్పొరేట్‌ వ్యవసాయం వస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామరాజు, కౌలు రైతు సంఘం అధ్యక్షుడు చంద్రపాల్‌, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆవులయ్య, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

కంభం: రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ మంగళవారం రైతు సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో కంభంలో  ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిం చారు. స్థానిక స్టేట్‌బ్యాంక్‌ నుంచి కందులాపురం సెం టర్‌ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్ర భుత్వం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో  రైతు సంఘం పశ్చిమ ప్రకాశం సహాయ కార్యదర్శి పెద్దిరెడ్డి దాసరిరెడ్డి, కొప్పుల సత్యనారాయణరెడ్డి, పానుగంటి సతీష్‌కుమార్‌, వెంకటశేఖర్‌,  తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-27T05:25:35+05:30 IST