ఆరుబయటే ధాన్యం

ABN , First Publish Date - 2021-05-17T05:20:03+05:30 IST

రైతులకు ఇ బ్బందులు తప్పడం లేదు. ఆరుగా లం కష్టించి పండించిన పంటను అ మ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతు న్నారు.

ఆరుబయటే ధాన్యం
సిర్సవాడలో రోడ్డుపైనే వరి ధాన్యం కుప్పలు

- కొనుగోలు  కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత

- వేధిస్తున్న హమాలీల సమస్య 

-  రైతులకు తప్పని అవస్థ


తాడూరు, మే 16 : రైతులకు ఇ బ్బందులు తప్పడం లేదు. ఆరుగా లం కష్టించి పండించిన పంటను అ మ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతు న్నారు. తాడూరు మండల వ్యాప్తంగా 24 గ్రామ పంచాయతీల పరిధిలో ఈ ఏడాది దాదాపు 12 వేల ఎకరా ల్లో రైతులు వరిని సాగు చేశారు. ప్ర భుత్వ లెక్కల ప్రకారం ఎకరాకు 30 క్వింటాళ్ల దిగుబడితో అంచనా వేసి నా, మండల వ్యాప్తంగా దాదాపు 3.60 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వ చ్చే అవకావం ఉన్నది. మండలంలో ప్రాథమిక సహకార సంఘంతో పా టు మండల మహిళా సమాఖ్య ఆ ధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రా లను ఏర్పాటు చేశారు. ఇందులో పీ ఏసీఎస్‌ ద్వారా పది కేంద్రాలు, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గో విందాయపల్లి, ఐతోల్‌ గ్రామాల్లో కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో రైతులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ధాన్యాన్ని నింపేందుకు గ న్నీ బ్యాగుల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు ధాన్యాన్ని నింపిన సంచులను లారీల్లో వేసుకుని తీసుకెళ్లేందుకు హమాలీల సమస్య ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రాల వద్ద ఆరబెట్టిన ధాన్యం ఇటీవల కు రుస్తున్న అకాల వర్షాలకు తడిసిపోతోంది. అలాగే కల్లాల వద్ద ఏర్పా టు చేసిన ధాన్యం కూడా తడిసిపోతోంది. దీంతో రైతులు పడిన క ష్టం మొత్తం నీటి పాలవుతోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారు లు స్పందించి, వరి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాల్సి ఉన్నది. గన్నీ బ్యాగుల కొరత తీర్చాల్సిన అవసరం ఉన్నది.

Updated Date - 2021-05-17T05:20:03+05:30 IST